వైన్స్ కంటే బార్లు కాస్త ఆలస్యంగా బంద్ అవుతాయి. అలాంటి బార్ల వేళల విషయంలో చండీగఢ్ కీలక నిర్ణయం తీసుకుంది. అసలు ఆ నిర్ణయం ఏంటంటే..!
మందుబాబులకు గుడ్‌న్యూస్ చెప్పింది చండీగఢ్. బార్ల వేళల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్రపాలిత ప్రాంతమైన చండీగఢ్‌లో ఇకపై ఉదయం 3 గంటల వరకు బార్లు తెరిచే ఉంటాయి. ఈ మేరకు కొత్త ఎక్సైజ్ పాలసీ 2023–24ను చండీగఢ్ అడ్మినిస్ట్రేషన్ రిలీజ్ చేసింది. అలాగే మద్యం మీద ‘కౌ సెస్’ను కూడా తగ్గించింది. నూతనంగా ‘క్లీన్ ఎయిర్ సెస్’ను తీసుకొచ్చింది. చండీగఢ్‌లో ఇంతకుముందు అర్ధరాత్రి ఒంటిగంట వరకే బార్లకు పర్మిషన్ ఉండేది. కానీ ఇప్పుడు అదనంగా మరో రెండు గంటలు బార్లను తెరుచుకునేందుకు అనుమతిని ఇచ్చారు.
చండీగఢ్ అడ్మినిస్ట్రేషన్ కొత్త ఎక్సైజ్ పాలసీలో ‘కౌ సెస్’ను తగ్గించారు. స్వదేశంలో తయారైన 750 ఎంఎల్ లిక్కర్ బాటిల్ మీద కౌ సెస్ గతంలో రూ.5 ఉండేది. ఇప్పుడు దాన్ని రూ.1కి తగ్గించారు. అలాగే బీరుపై కూడా రూ.5గా ఉన్న ఈ సెస్‌ను రూ.1కి పరిమితం చేస్తున్నట్లు తెలిపారు. దీంతో పాటు 750/700 ఎంఎల్ విస్కీ మీద కౌ సెస్‌ను రూ.10 నుంచి రూ.2కి తగ్గించారు. ఎక్సైజ్ డ్యూటీలోనూ ఎలాంటి మార్పులు చేయకపోవడం గమనార్హం. ఆల్కహాల్ డ్రింక్స్ స్థానంలో బీర్, వైన్‌ను ప్రోత్సహించే ఉద్దేశంతో వాటిపై లైసెన్స్ రుసుములను పెంచలేదు. మరి.. చండీగఢ్ అడ్మినిస్ట్రేషన్ తీసుకున్న ఈ నిర్ణయాల మీద మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.