కరోనా వైరస్ తర్వాత మళ్లీ ఇప్పుడు హెచ్3ఎన్2 వైరస్ ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తోంది. దేశంలో కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం హెచ్3ఎన్2 వైరస్‌పై స్పందించింది.
దేశంలో హెచ్3ఎన్2 వైరస్ కేసులు రోజురోజుకు పెరుగుతూ పోతున్నాయి. ఈ కేసుల బారినపడి ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతూ పోతోంది. దీంతో ఐసీఎమ్‌ఆర్ హెచ్3ఎన్2 వైరస్‌కు సంబంధించి కొన్ని గైడ్‌లైన్స్‌ను విడుదల చేసింది. ప్రజలు వాటిని తప్పకుండా పాటించాలని విజ‍్క్షప్తి చేసింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం హెచ్3ఎన్2 వైరస్‌పై స్పందించింది. దేశ వ్యాప్తంగా వస్తున్న హెచ్3ఎన్2 వైరస్ కేసులను పరిశీలిస్తున్నామని తెలిపింది. ఐసీఎమ్‌ఆర్ ముందు జాగ్రత్త గైడ్‌లైన్స్‌ను విడుదల చేసిందని పేర్కొంది. ఈ నెల ఆఖరు లోపు హెచ్3ఎన్2 వైరస్ కేసులు ఆగిపోతాయని స్పష్టం చేసింది. అయితే, కేంద్రం చేసిన ఈ ప్రకటనపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గతంలోనూ కరోనా వైరస్ విషయంలో కేంద్రం ఇలానే చెప్పిందని, తర్వాత ప్రజలు ఎలాంటి కష్టమైన పరిస్థితులు ఎదుర్కొన్నారో అందరికీ తెలుసునంటూ మండిపడుతున్నారు. ఇలాంటి వైరస్‌లను అడ్డుకోవటంలో కేంద్రం మొదటినుంచి సరైన పద్దతిని ఫాలో కావాలని అంటున్నారు. పరిస్థితులు చెయ్యి దాటిపోయిన తర్వాత ఏం చేసినా లాభం లేదంటున్నారు. కేంద్ర ప్రభుత్వం కచ్చితమైన విధానాలతో వైరస్‌ను అరికట్టడంలో ముందుకెళ్లాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా, H3N2 ఇన్‌ఫ్లుయెన్జా వైరస్ ఓ అంటు వ్యాధి. ఇది ఒకరినుంచి మరొకరికి వ్యాపిస్తుంది. కరోనా వైరస్‌లో ఉన్న లక్షణాలే ఇందులో కూడా ఉంటాయి. ఇది మానవ శ్వాస కోశ వ్యవస్థపై ప్రభావం చూపే ఓ వైరస్.
జ్వరం, దగ్గు, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, ముక్కు కారటం, గొంతు నొప్పి, వాంతులు కావటం, అలసట, ఒణుకు, విరేచనాలు H3N2 ఇన్‌ఫ్లుయెన్జా వైరస్ లక్షణాలు. ఈ వైరస్ లక్షణాలు ఉన్నట్లయితే ఇంట్లోనే ఓ రోజు మొత్తం రెస్ట్ తీసుకోవాలి. తగిన మాత్రలు వేసుకుంటూ, విశ్రాంతి తీసుకుంటూ ఉండాలి. అప్పటికూడా ఆరోగ్యం కుదుటపడకపోతే డాక్టర్‌ను సంప్రదించాలి. మరి, హెచ్3ఎన్2 వైరస్ కేసులు మార్చి ఆఖరు కల్లా తగ్గుతాయన్న కేంద్రం ప్రకటనతో మీరు ఏకీభవిస్తారా?.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.