10 రోజుల పాటు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు అధికారులు. మార్చి 16 నుంచి 26 వరకూ అన్ని విద్యాసంస్థలను మూసివేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పది రోజులు స్కూళ్లకు సెలవులు ఇవ్వడానికి కారణం ఏంటంటే?
కరోనా వైరస్ తర్వాత మళ్లీ ఇప్పుడు హెచ్3ఎన్2 వైరస్ ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తోంది. దేశంలో కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం హెచ్3ఎన్2 వైరస్‌పై స్పందించింది.
దేశవ్యాప్తంగా ఈ హెచ్3ఎన్2 ఇన్ ఫ్లుఎంజా వైరస్ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ఇప్పటివరకు దీని ప్రభావం పెద్దగా లేదని భావించారు. కానీ ఈ వైరస్ వల్ల కర్ణాటక, హర్యానా రాష్ట్రాల్లో ఇద్దరు మృతి చెందినట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి.
భారత్‌లో ఇన్ఫ్లుయెంజా హెచ్3ఎన్2 వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. గత రెండు, మూడు నెలలుగా ఈ వైరస్ కేసులు పెరుగుతుండటం అందర్నీ ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా ఈ ఫ్లూతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
కరోనా వైరస్ పరిస్థితులు పోయి ఇప్పుడిప్పుడే జనం సాధారణ పరిస్థితుల్లో బతుకుతున్నారు. ఇలాంటి సమయంలో ఓ కొత్త వైరస్ మళ్లీ దేశంలో చెలరేగిపోతోంది. దేశ వ్యాప్తంగా కొన్ని వేల మంది వైరస్ బారిన పడుతూ ఉన్నారు.
ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా అకస్మాత్తుగా జ్వరం, దగ్గు జలుబు, తలనొప్పి, వికారం, వాంతులు వంటి వ్యాధులు సోకుతున్నాయి. అయితే చూడ్డానికి ఇది కోవిడ్-19 లానే కనబడుతుంది. చాలా మంది మళ్ళీ కోవిడ్-19వచ్చిందేమో అన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి నిజంగా కోవిడ్-19, హెచ్3ఎన్2 ఇన్ఫ్లూయెంజా వైరస్ లు రెండూ ఒకటేనా? ఈ రెండిటి మధ్య తేడా ఏంటి? వీటి లక్షణాలు ఏమిటి?