ప్రపంచంలో శాంతి నెలకొల్పడానికి విశేష కృషి చేసిన వారికి ప్రతి ఏటా నోబెల్ శాంతి పురస్కారం అందజేస్తారు. ఇప్పటికే భారత్ నుంచి పలువురు ఈ పురస్కారం అందుకున్నారు. ఇక ఈ ఏడాది మోదీకి నోబెల్ శాంతి బహుమతి వచ్చే అవకాశం ఉంది అనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఆ వివరాలు..
ప్రపంచలోనే అత్యంత ప్రతిష్టాత్మక పురస్కారంగా నోబెల్ బహుమతికు పేరు ఉంది. ప్రతి ఏటా వైద్యం, శాంతి, ఆర్థిక, భౌతిక, రసాయన శాస్త్రం, సాహిత్యంలో విశేష కృషి చేసిన వారి నోబెల్ పురస్కారం అందజేస్తారు. ఆరు రంగాల్లో ఇచ్చే ఈ బహుమతులను ప్రతి యేటా నోబెల్ వర్ధంతి అయిన డిసెంబర్ 10న స్వీడన్ లోని స్టాక్ హోంలో ఇస్తారు. మన దేశం నుంచి కూడా పలువురు నోబెల్ పురస్కారాలు అందుకున్నారు. ఈ క్రమంలో తాజాగా నోబెల్ శాంతి బహుమతికి సంబంధించి మన దేశంలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి నరేంద్ర మోదీకి ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నోబెల్ శాంతి బహుమతి మోదీకి రావడం ఏంటి.. అసలు ఏం జరిగిందో తెలియాలంటే.. ఇది చదవండి..
మన ప్రధాని నరేంద్ర మోదీకి ప్రపంచ వ్యాప్తంగా రోజురోజుకూ ఆదరణ పెరుగుతోంది. మరీ ముఖ్యంగా కరోనా సమయంలో పలు దేశాలకు వ్యాక్సిన్ అందించి మహమ్మారిని అంతం చేసే ప్రక్రియలో మోదీ కీలకపాత్ర పోషించిన నేతగా నిలిచారు. అంతేకాక ప్రకృతి విపత్తులతో అల్లాడుతున్న దేశాలకు మన దేశం తరఫున సాయం అందించి.. అంతర్జాతీయ సమాజంతో మంచి సంబంధాలు కొనసాగిస్తున్నారు మోదీ. తాలిబన్లు కూడా మన దేశాన్ని నమ్ముతున్నారు అంటే అర్థం చేసుకోవచ్చు. ఇక తాజాగా భూకంపంతో విలవిల్లాడిన టర్కీకి మన దేశం తరఫున భారీగా సాయం చేసి.. ప్రశంసలు పొందారు మోదీ. ప్రస్తుతం అంతర్జాతీయ సమాజంలో కూడా మోదీకి మంచి పాపులారిటీ ఉంది.
అయితే ప్రధాని మోదీకి ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి లభించే అవకాశం ఉందని వార్తలు తెగ ప్రచారం అవుతున్నాయి. ఇందుకు కారణం లేకపోలేదు. ఇటీవల నోబెల్ బహుమతి కమిటీ భారత్‌లో పర్యటించింది. ఈ సందర్భంగా నార్వే నోబెల్ కమిటీ సభ్యులు ప్రధాని మోదీపై ప్రశసంల జల్లులు కురిపించడంతో.. ఈ ఏడాది మోదీకి నోబెల్ శాంతి బహుమతి వచ్చే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయం బలంగా వినిపస్తోంది. అంతేకాక నోబెల్ కమిటీ వ్యాఖ్యలతో శాంతి బహుమతి రేసులో ప్రధాని మోదీ గట్టి పోటీ ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది.
నోబెల్ బహుమతి కమిటీ బృందం నార్వే నుంచి భారత్ కు వచ్చింది. నోబెల్ శాంతి బహుమతి విజేతను నిర్ణయించే ఈ కమిటీ డిప్యూటీ ఛైర్మన్ అస్లే టోజే ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రధాని మోదీ లాంటి శక్తివంతమైన నేతకు ప్రపంచంలో శాంతిని నెలకొల్పే అద్భుతమైన సామర్థ్యం ఉందంటూ మోదీని ఆకాశానికెత్తారు. మోదీ లాంటి నేత.. ప్రపంచ శాంతిని పెంపొందించడంలో కీలక పాత్ర పోషించగలరని నమ్ముతున్నట్లు అస్లే టోజే అన్నారు.
నోబెల్ శాంతి బహుమతి కమిటీ డిప్యూటీ లీడర్ అస్లే టోజే మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఈ ఏడాదికి నోబెల్ శాంతి బహుమతికి సంబంధించి ఇండియా నుంచి అధిక సంఖ్యలో నామినేషన్లు అందుతున్నాయి. పంచంలోని ప్రతి దేశ అగ్రనేతలు శాంతి కోసం ఈ భూమ్మీద శాంతి స్థాపన కోసం కృషి చేస్తారని ఆశిస్తున్నాను. భారత ప్రధాని నరేంద్ర మోదీ లాంటి వ్యక్తిపై ప్రపంచ వ్యాప్తంగా నమ్మకం ఉంది. ప్రపంచ వ్యాప్తంగా శాంతిని నెలకొల్పడంలో మోదీ కీలకపాత్ర పోషిస్తారు. ఆయనకు అంతటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి’’ అని తెలిపారు. అంతేకాక.. పెద్ద యుద్దాలను సైతం మోదీ తన నాయకత్వ ప్రతిభ, విశ్వసనీయతతో ఆపడానికి ప్రయత్నిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. అస్లే టోజో చేసిన వ్యాఖ్యలతో.. ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి రేసులో ప్రధాని మోదీ గట్టిపోటీ ఇస్తారన్న వాదన మొదలైంది.
ఇక గతంలో 2002లో అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్, 2009లో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా నోబెల్ శాంతి బహుమతి అందుకున్నారు. 2001లో ఐక్యరాజ్యసమితి, ప్రధాన కార్యదర్శి కోఫీ అన్నన్, 2012లో యూరోపియన్ యూనియన్, 2014లో భారతీయ బాలలహక్కుల ఉద్యమకారుడు కైలాష్ సత్యార్థి, పాకిస్తాన్ కు చెందిన మలాలా యూసఫ్‌జాయ్‌లు కూడా శాంతి పురస్కారాలను అందుకున్నారు. ఇక అన్ని అనుకూలిస్తే.. ఈ ఏడాది మోదీ కూడా నోబెల్ శాంతి పురస్కారం అందుకుంటారు అనే ప్రచారం జోరుగా సాగుతోంది. మరి నిజంగానే మోదీకి నోబెల్ శాంతి బహుమతి అందుకుంటారని మీరు భావిస్తున్నారా.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
PM Narendra Modi is the biggest contender for the Nobel Peace Prize. He is continuously working for World peace and also has the ability to restore the World-Peace order. : Deputy leader of Nobel Prize Comittee pic.twitter.com/qlAShMscaP
— Megh Updates 🚨™ (@MeghUpdates) March 15, 2023