ప్రపంచంలో శాంతి నెలకొల్పడానికి విశేష కృషి చేసిన వారికి ప్రతి ఏటా నోబెల్ శాంతి పురస్కారం అందజేస్తారు. ఇప్పటికే భారత్ నుంచి పలువురు ఈ పురస్కారం అందుకున్నారు. ఇక ఈ ఏడాది మోదీకి నోబెల్ శాంతి బహుమతి వచ్చే అవకాశం ఉంది అనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఆ వివరాలు..
గత కొన్ని నెలలుగా రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతుంది. ఈ యుద్ధం వలన భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది.. జరుగుతోంది. ఈనేపథ్యంలో ఉక్రెయిన్ లో యుద్ధం కారణంగా వేలాది మంది చిన్నారులు అవస్థలు పడుతున్నారు. వారిని అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు తరలించేందుకు స్థానికంగా ఉండే ప్రముఖులు తమవంత సాయం చేస్తున్నారు. తాజాగా రష్యన్ జర్నలిస్ట్ నోబెల్ శాంతి బహుమతి గ్రహిత దిమిత్రి మురాతోవ్ చిన్నారులకు సాయం అందించేందుకు ముందుకు వచ్చారు. ఈ క్రమంలో […]