అమ్మా నాన్నల తర్వాత ఆడపిల్లలకు అన్నదమ్ములతో ఉండే అనుబంధం వెలకట్టలేనిది. ‘అ’మ్మ లో అనుబంధం.. నా’న్న’ లో అనురాగం కలగలిపి ప్రేమను పంచేవాడు అన్న అంటారు. ఇంటి ఆడపడుచును ఎప్పటికీ కంటికి చెప్పలా కాపాడుతూ.. ఏ కష్టం రాకుండా అన్ని విధాల తోడు నీడ గా నిలుస్తాడు. తన తొబుట్టువును ఒక ఇంటికి ఇచ్చినప్పటికీ.. తన ఇంటి ఆడపిల్ల కోసం ఒక సైనికుడిలా కాపు కాస్తుంటాడు. అన్నాచెల్లెల్ల సెంటిమెంట్ తో ఎన్నో సినిమా వచ్చాయి.. సూపర్ హిట్ అందుకున్నాయి. తాజాగా అన్నా చెల్లెలి అనుబంధానికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కన్నీరు పెట్టడం ఖాయం.. అంత హార్ట్ టచింగ్ గా ఉంది.
సాధారణంగా మహిళలకు జుట్టు ప్రత్యేక ఆకర్షణ ఇస్తుంది. అందుకే కేశాలంకరణకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. అందమైన కురులు వారికి మరింత అందాన్ని పెంచుతాయి. అలాంటి కురులను తీసేసి గుండుగా మారిస్తే ఏ అమ్మాయి అయినా తల్లడిల్లి పోతుంది. అచ్చం అలాంటి ఇబ్బంది ఆ అమ్మాయి పడింది.. తన చుట్టును ట్రిమ్మర్ తో కట్ చేసి గుండు చేస్తే కన్నీరు పెట్టుకుంది. అది చూసిన ఆమో సోదరుడికి ఎంతో బాధ కలిగింది. తన సోదరి సంతోషం కోసం.. ధైర్యాన్ని ఇచ్చేందుకు తాను కూడా ట్రిమ్మర్‌తో జుట్టు కట్ చేసుకున్నాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
కొంత కాలంగా క్యాన్సర్ తో ఓ అమ్మయి బాధపడుతుంది. క్యాన్సర్ చికిత్సలో భాగంగా ఆమె సోదరుడు ట్రిమ్మర్ తో ఎయిర్ కట్ చేశాడు. హెయిర్ కట్ చేస్తున్న సమయంలో సోదరడి కన్నీరు పెట్టుకోవడం చూసి నవ్వుతూ అతను కూడా తన హెయిర్ కట్ చేసుకున్నాడు. అది చూసిన సోదరి కన్నీళ్లతో అతడిని కౌగిలించుకొని కన్నీరు పెట్టుకుంది. తర్వాత ఆమె తన సోదరుడిని కుర్చీపై కూర్చోబెట్టి ట్రిమ్మర్ తో జుట్టు కట్ చేస్తుంది. తాజాగా దీనికి సంబంధించి వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
క్యాన్సర్ భారిన పడిన వారికి జుట్టు ఎక్కువగా ఊడిపోతుంది. ఇక కిమోథెరపీ చేయించుకున్న వారికి జుట్టు బాగా ఊడిపోతుంది.. అందుకే వారు ఎక్కువగా హెయిర్ కట్ చేసుకుంటారు. ఈ వీడియో చూసి ఎంతో మంది భావోద్వేగానికి లోనవుతున్నారు. చాలా మంది ఈ వీడియో చూస్తే తమకు తెలియకుండానే కన్నీళ్లు వస్తున్నాయని కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటిక వరకు ఈ వీడియోని 1.5 మిలియన్లకు పైగా నెటిజన్లు చూశారు.. లక్ష లైక్స్ కొట్టారు.
NO ONE FIGHTS ALONE: Brother shaves his head in solidarity with sister who is fighting cancer. 🙏❤️🙏 pic.twitter.com/ExX69N3P1a
— GoodNewsMovement (@GoodNewsMVT) October 13, 2022