ఇటీవల సినీ పరిశ్రమలో వరుసగా తీవ్ర విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. సినీ ప్రముఖులు, ఇతర సాంకేతిక వర్గానికి చెందిన వివిధ కారణాలతో కన్నుమూస్తున్నారు.
ఈ మద్య పలు సినీ ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు చోటు చేసుకోవడంతో అభిమానులు తీవ్ర ఆందోళనకు గురైతున్నారు. వెండితెర, బుల్లితెరకు సంబంధించిన నటీనటులు, దర్శక, నిర్మాతలు, ఇతక సాంకేతిక రంగానికి చెందినవారు వరుసగా కన్నుమూస్తున్నారు. దీంతో వారి కుటుంబాల్లోనే కాదు.. వారిని ఎంతగానో అభిమానించే అభిమానులు సైతం శోకసంద్రంలో మునిగిపోతున్నారు. తాజాగా సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. తన కామెడీతో కోట్ల మంది అభిమానుల హృదయాలు గెల్చుకున్న ప్రముఖ నటుడు ఓ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. వివరాల్లోకి వెళితే..
హాలీవుడ్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అమెరికన్ స్టార్ కమెడియన్ పాల్ రెబెన్స్ కన్నుమూశారు. ఆయన వయసు 70 సంవత్సరాలు. కొంతకాలంగా పాల్ రుబెన్స్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. ఆదివారం ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు ఓ మీడియా పేర్కొంది. 80వ దశకంలో పాల్ రెబెన్స్ పీవీ హర్మన్ పాత్రతో కోట్ల మంది ప్రేక్షకుల ఆదరణ సంపాదించాడు. ఆ పాత్ర ఆయనకు ఇండస్ట్రీలో ఓ ప్రత్యేకతను తెచ్చిపెట్టింది. ఆయన హెహెహె అంటూ ఓక రకమైన నవ్వు అప్పట్లో చిన్న పిల్లలకు బాగా నచ్చడంతో అందరికీ హాట్ ఫెవరేట్ అయ్యారు. వెండితెరపై ఆయన కనిపిస్తే చాలు పగలబడి నవ్వేవారు ఆడియన్స్.
2001 లో వచ్చిన బ్లో మూవీలో డ్రగ్స్ డలింగ్ హెయిర్ డ్రెస్సర్ గా నటించిన పాల్ రెబెన్స్ ఎంతో గొప్ప ప్రశంసలు అందుకున్నారు. ఆయన చివరి మూవీ పీవీస్ బిగ్ హాలి డే.. ఈ మూవీకి రచయిత, నిర్మాత కూడా ఆయనే. వెండితెర మాత్రమే కాదు.. బుల్లితెరపై కూడా ఆయన చెరగని ముద్ర వేశారు. పాల్ రెబెన్స్ కి క్యాన్సర్ ఉన్నట్లు ఎప్పుడూ చెప్పలేదని.. ఈ విషయం తెలిసిన తర్వాత తాము ఎంతో బాధపడ్డామని ఆయన అత్యంత సన్నిహితులు ఆవేదన వ్యక్తం చేశారు. క్యాన్సర్ తో పాల్ ఆరు సంవత్సరాలుగా పోరాడుతున్నారని.. తాను క్యాన్సర్ మహమ్మారి భారిన పడ్డ విషయం ఎవరికీ చెప్పలేదని.. ఇందుకు స్నేహితులు, అభిమానులు తనని క్షమించాలని చనిపోయే ముందు ఓ నోట్ రాశాడు. పాల్ రెబెన్స్ మృతి పట్ల పలువురు హాలీవుడ్ సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు.