ప్రతి మనిషికి ఎన్నో కోరికలు ఉంటాయి. ముఖ్యంగా సొంత కారు, ఇళ్లు ఉండాలని చాలా మంది కోరుకుంటారు. అలానే తమ కలలను సాకారం చేసుకుంటూ కారు, ఇళ్లను కొనుగోలు చేస్తుంటారు. ఇక కొత్త కారు కొన్న సంతోషంలో కొందరు లాంగ్ డ్రైవ్ చేస్తుంటారు. అయితే ఇంత సంతోషంగా జర్ని చేసే వారికి ఓ భయంకరమైన వార్త చెప్పాల్సి వస్తుంది.
ప్రతి మనిషికి ఎన్నో కోరికలు ఉంటాయి. ముఖ్యంగా సొంత కారు, ఇళ్లు ఉండాలని చాలా మంది కోరుకుంటారు. అలానే తమ కలలను సాకారం చేసుకుంటూ కారు, ఇళ్లను కొనుగోలు చేస్తుంటారు. ఇక కొత్త కారు కొన్న సంతోషంలో కొందరు లాంగ్ డ్రైవ్ చేస్తుంటారు. అయితే ఇంత సంతోషంగా జర్ని చేసే వారికి ఓ భయంకరమైన వార్త చెప్పాల్సి వస్తుంది. అది ఏమిటంటే.. కొత్త కారులో దూరప్రయాణం చేసే వారికి ఓ వ్యాధి వచ్చే ప్రమాదం ఉందని ఓ అధ్యాయనంలో తెలింది. మరి.. ఆ స్టోరీ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కష్టపడి డబ్బు సంపాదించాక సొంతిళ్లు నిర్మించుకోవాలని, అలానే ఓ మంచి కారు కొనుకోవాలని చాలా మంది కలలు కంటారు. అయితే అలా మీరు ఎంతో ఆశతో కొన్న కొత్త కారు మీకు చిక్కులు తెచ్చి పెట్టనుంది. ఎందుకంటే కొత్త కారులో నుంచి వచ్చే వాసన చాలా ప్రమాదకరమని ఓ అధ్యాయనంలో తేలింది. అలానే కొత్త కార్లలో దూర ప్రయాణలు చేయడం వల్ల క్యాన్సర్ వస్తుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. హార్వర్డ్ యూనివర్సటీ, చైనాలోని బీజింగ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకులు ఈ అధ్యాయనాన్ని రూపొందించారు. వారు జరిపిన పరిశోధనలో అనేక ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఆ యూనివర్సీటీ పరిశోధకులు జరిపిన అధ్యాయనం ప్రకారం.. కొత్త వాహనం లాంగ్ డ్రైవ్ చేయం మంచిది కాదంట.. అలా చేయడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం పెరుగుతుందంట. అంతేకాక దాదాపు 20 నిమిషాలు కొత్త వాహనాన్ని డ్రైవింగ్ చేయడం కూడా చాలా ప్రమాదకరమని నివేదిక పేర్కొంది. కొన్ని కొత్త కార్లను తీసుకుని వాటి పరిస్థితిని గమనించి ఈ నివేదికను రూపొందించారు. పరిశోధకులు కారులో వివిధ పదార్థాలను గుర్తించడానికి పలు సెన్సార్లను ఉపయోగించారు. అలానే కొత్త కార్లలో గాలి నాణ్యతను పరిశోధించారు. వరుసగా రెండు వారల పాటు వాటిని మూసివేసి భిన్నమైన వాతావరణ పరిస్థితుల వెలుపల ఉంచి పరీక్షించారు. ఈక్రమంలో కారు నుంచి ఉత్పత్తి అయ్యే వాసన క్యాన్సర్ కి దారితీస్తుందని గుర్తించారు.
ఫార్మాల్డిహైడ్ అనే కాలుష్యకారకం కొత్త కార్లలో చైనా జాతీయ భద్రతా అవసరాల కంటే 34.9 శాతం ఎక్కువ స్థాయిలో ఉందని పరిశోధకులు గుర్తించారు. ఇలాంటి అధ్యయనాలు గతంలో చాలాసార్లు జరిగాయి. 2021 సంవత్సరంలో రివర్సైడ్ లోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన నిపుణులు కొత్త వాహనాన్ని ఎక్కువసేపు నడపడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం పెరుగుతుందని, 20 నిమిషాల కంటే ఎక్కువ డ్రైవింగ్ చేయడం వల్ల ప్రమాదకరమైన కెమికల్ ప్రభావానికి గురవుతామని పేర్కొన్నారు. మరి.. కొత్త కార్ల విషయంలో తాజాగా అధ్యాయనం చెప్పిన విషయాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.