Sukhtawa River Bridge: నాణ్యతా లోపం కారణంగానో, వయోభారం కారణంగానో బ్రిడ్జిలు కూలిపోయిన సంఘటనలు దేశ వ్యాప్తంగా చాలానే జరిగాయి. తాజాగా, భారీ లారీ ప్రయాణించటం కారణంగా ఓ బ్రిడ్జి కుప్పకూలింది. ఈ సంఘటన మధ్యప్రదేశ్లో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు… మధ్య ప్రదేశ్, నర్మదాపురం జిల్లాలోని సుఖ్‌తావా నదిపై భోపాల్-నాగ్‌పుర్ హైవే బ్రిడ్జి ఉంది. సాధారణంగా ఈ హైవే బ్రిడ్జిపై వాహనాలు పెద్ద సంఖ్యలో తిరుగుతుంటాయి. ఆదివారం 128 చక్రాలు కలిగిన ఓ లారీ ఈ బ్రిడ్జిపైకి వచ్చింది. 20 అడుగుల వెడల్పైన భారీ పవర్ సామాగ్రిని మోసుకెళుతోంది. అక్కడికి దగ్గరలోని ఇటార్సి పవర్ గ్రిడ్‌కు వాటిని తీసుకెళుతోంది.
ఈ నేపథ్యంలో బ్రిడ్జి ఆ బరువును తట్టుకోలేకపోయింది. ఉన్నట్టుండి పెళ్లున కూలిపోయింది. దీంతో లారీ 25 అడుగుల లోపలికి కూలబడిపోయింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు చిన్న చిన్న గాయాలయ్యాయి. బ్రిడ్జి కూలిపోవటంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ట్రాఫిక్‌ను వేరే వైపునకు మళ్లించారు. కాగా, ఇలాంటి సంఘటనే ఒకటి జార్ఖండ్‌లో చోటుచేసుకుంది. కొత్తగా కట్టిన ఓ బ్రిడ్జి ఒకటి కుప్పకూలింది. అక్రమ మైనింగ్ కారణంగా సదరు కంచి నదిపై ఉన్న బ్రిడ్జి పాడైపోయినట్లు, అందుకే కుప్పకూలినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ సంఘటనలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : చనిపోయాడని చెప్పిన డాక్టర్లు.. అంత్యక్రియలకు స్నానం చేయిస్తుండగా షాకింగ్ సీన్!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.