ఈ మధ్యకాలంలో అక్కడక్కడ జరిగే వివాహాల్లో కొన్ని సంఘటనలు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. పెళ్లికి అంతా సిద్దం చేసుకుని తీరా పెళ్లి ముహూర్తం దగ్గర పడుతున్న సమయంలో అబ్బాయి నచ్చలేదనో, అమ్మాయి నచ్చలేదనో పెళ్లికి నిరాకరించి వివాహాలను రద్దు చేసుకుంటున్నారు.
కొన్ని సంఘటనల్లో మద్యం తాగి వచ్చిన వరున్ని చూసి వధువు పెళ్లికి అడ్డు చెప్పడంతో పీటల మీద ఆగిపోయిన పెళ్లిల్లు ఉన్నాయి. పెళ్లికి అంతా సిద్దమయ్యాక కూడా కట్నం తక్కువైందని, పెళ్లిలో లోటు చేశారనే కారణాలతో వివాహాలు రద్దు అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే తాజాగా ఓ వరుడు పెళ్లి మూహూర్త సమయానికి తన వక్రబుద్దిని ప్రదర్శించి వధువు ఆగ్రహానికి గురయ్యాడు. ఇంతకీ ఆ వరుడు చేసిన ఘన కార్యం ఏంటి? ఆ వధువు ఎందుకు ఆగ్రహించిందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉత్తర ప్రదేశ్ లోని ప్రతాప్ గడ్ ప్రాంతానికి చెందిన యువతీ యువకునికి కుటుంబ సభ్యులు పెళ్లి నిశ్చయించారు. మంచి ముహూర్తం పెట్టుకున్నారు. పెళ్లి చేయడానికి ఇరు కుటుంబాలు సిద్దమయ్యారు. ఇరు కుటుంబాలు వివాహ ఏర్పాట్లు చేసుకున్నారు. కాగా వివాహ వేడుకలో భాగంగా వరుడు, బంధువులు సన్నిహితుల మధ్య ఊరేగింపుతో వధువు ఇంటికి చేరుకున్నాడు. ఈ లోగ ముహూర్త సమయం దగ్గర పడింది. కొద్ది సమయంలో వధువు మెడలో జయమాల వేసి కళ్యాణమాడాల్సిన వరుడు ఉన్నట్టుండి తన వక్ర బుద్దిని బయటపెట్టాడు. అదనపు కట్నం ఇస్తేనే వివాహం చేసుకుంటానని మొండిపట్టు పట్టాడు. ఈ ఆకస్మిక పరిణామంతో వధువు కుటుంబ సభ్యులు షాక్ కు గురయ్యారు.
ఆ తర్వాత వధువు కుటుంబసభ్యులు పెళ్లికొడుకుని బుజ్జగించి, పెళ్లికి ఒప్పించే ప్రయత్నం చేశారు. కానీ ఆ వరుడు తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. వరుడి కుటుంబ సభ్యులు కూడా వరుడి నిర్ణయానికే కట్టుబడ్డారు. దీంతో విసుగెత్తి పోయిన వధువు కుటుంబసభ్యులు ఎవ్వరు ఊహించని నిర్ణయం తీసుకున్నారు. వరుడిని చెట్టుకు కట్టేసి దేహ శుద్ది చేశారు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరుకుటుంబాలను స్టేషన్ కు తరలించారు. ఈ తతంగాన్ని అంతా అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఆ వీడియో వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజన్స్ వక్ర బుద్ది వరుడికి తగిన శాస్తి జరిగిందంటూ కామెంట్ చేస్తున్నారు.
इस लइका का जयमाल हो गया था .. उसके बाद परिजन दहेज की डिमांड करने लगे। जिसके बाद लड़की के परिजन ने दूल्हे साहेब को पेड़ से बांध दिया।
वीडियो यूपी के प्रतापगढ़ से है ।। pic.twitter.com/obOG9BpLMB
— हम लोग We The People (@ajaychauhan41) June 15, 2023