సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఎన్నో వింతలు విశేషాలు మన కళ్ల ముందు ఆవిష్కరించబడుతున్నాయి. కొన్ని వీడియోలు కడుపుబ్బా నవ్వించే విధంగా ఉంటే.. కొన్ని కన్నీళ్లు తెప్పించేవిధంగా ఉంటున్నాయి. ఈ మద్య పెళ్లి వేడుకల్లో నూతన వధువరుల పెళ్లి తతంగం నుంచి ఊరేగింపు, పెళ్లి తర్వాత జరిగే రిసెప్షన్ వరకు ఏదో తీపి గుర్తులకు సంబంధించిన వీడియోలు అలరిస్తున్నాయి. పెళ్లి కూతురు డ్యాన్స్ కి నూతన పెళ్లికొడుకు ఫిదా కావడం.. కొన్నిసార్లు సీరియస్ కావడం చూస్తున్నాం.
ఓ పెళ్లి వేధికపై పెళ్లి కూతురు పెళ్లి కొడుకు చెంప చెల్లుమనిపించిన ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. పెళ్లి వేడుకకు బంధు,మిత్రులు అందరూ వచ్చారు. పెళ్లి పందిరి వద్ద సందడి నెలకొంది. అదే సమయంలో అందరూ ఆశ్చర్యపోయేలా పెళ్లి పందిరిలో పెళ్లి కూతురు వరుడి చెంప ఛెల్లుమనిపించింది. పెళ్లి కూతరు మెడలో దండ వేయగానే చెంప పగులగొట్టింది. అంతే తొందరగా ళ్లి పందిరి నుంచి వెళ్లిపోయింది. అప్పటి వరకు పెళ్లి కొడుకు ఫ్రెండ్స్, బంధు, మిత్రులు, పెళ్లికి వచ్చిన వారితో సందడిగా ఉన్న పెళ్లి మండపం ఒక్కసారిగా పెళ్లి కూతురు రియాక్షన్‌తో సైలెంట్‌గా మారిపోయింది.
హిమాచల్ ప్రదేశ్ లో ఈ కామెడీ సంఘటన చోటు చేసుకుంది. అయితే పెళ్లి కూతురు కి అంతగనంకోపం ఎందుకు వచ్చినట్లు.. ఒకవే కట్న, కానుకల విషయంలో వరుడు తరపున బంధువులు ఏమైనా అడగడం వల్ల పెళ్లి కూతురు అలా రియాక్ట్ అయి ఉండొచ్చని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి ఈ సీన్ అయిన తర్వాత వరుడు షాక్‌తో చూస్తూ ఉండడం తప్ప ఏమీ చేయలేకపోయాడు. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
नशे में था दूल्हा, दुल्हन ने कर दी थप्पड़ों की बरसात#हमीरपुर #Hamirpur #Dulhan pic.twitter.com/Bus2yf3y14
— @Amit kumar singh🇮🇳 (@amit_alex1) April 18, 2022