ఇటీవల కొంత మంది దొంగలు పట్టపగలు బ్యాంకుల్లో చొరబడి కత్తులు, గన్స్ తో బెదిరించి డబ్బు దోచుకు వెళ్లిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలో కొన్నిసార్లు బ్యాంక్ స్టాప్ పై దాడులు చేయడం.. హత్యలు చేయడం కూడా జరిగాయి. దొంగల వద్ద మారణాయుధాలు ఉంటాయి కనుక.. సిబ్బంది కూడా వారికి భయపడిపోతారు. కొన్నిసార్లు బ్యాంక్ సిబ్బంది ధైర్యం చేసి దొంగలను పట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఒక దొంగ కత్తితో బ్యాంక్ లో చొరబడి సిబ్బందిని బెదిరించి డబ్బు తీసుకు వెళ్లే ప్రయత్నం చేయగా మహిళా మేనేజర్ ఆ దొంగని ఎదిరించడమే కాదు.. చుక్కలు చూపించింది. ఈ ఘటన రాజస్థాన్‌లో చోటు చేసుకుంది.
రాజస్థాన్ లోని ఒక గ్రామీణ బ్యాంక్ లో బ్యాంక్ పనివేళలు ముగిసిన తర్వాత ఆఫీస్ పనులు చేస్తున్నారు. అదే సమయానికి ఓ వ్యక్తి ముఖానికి ముసుగు వేసుకొని బ్యాంక్ లోకి వచ్చాడు. అది గమనించిన ఓ బ్యాంక్ అధికారి వెంటనే అతన్ని బయటికి వెళ్లాలని గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. దాంతో అతని బయటికి వెళ్లిన కొద్ది సేపటికి కత్తి తీసుకొని మళ్లీ లోపలికి వచ్చాడు. అందరి ఫోన్లు లాక్కొని తన వద్ద ఉంచుకున్నాడు. అంతేకాదు బ్యాంక్ లో ఉన్న డబ్బును బ్యాక్ లో పెట్టి తన చేతికి ఇవ్వాలని బెదిరించాడు.
అదే సమయానికి బ్యాంక్ మేనేజర్ పూనమ్ గుప్తా లోపలికి రాగానే దొంగ చేస్తున్న హడావుడి కనిపించింది. వెంటనే అతన్ని చూసి భయపడకుండా చేతిలో కటింగ్ ప్లేయర్ తీసుకొని ఆ దొంగని ఎదిరించింది. ఆమె చూపిస్తున్న తెగువ చూసి దొంగ బయపడి పారిపోవడానికి ప్రయత్నించాడు. అప్పటికే బ్యాంక్ గేట్ మూసి వేయాలని చెప్పింది పూనమ్ గుప్తా. వెంటనే తన వద్ద ఉన్న ఫోన్ తీసుకొని పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు వచ్చి దొంగను అరెస్ట్ చేశారు. మొత్తానికి బ్యాంక్ మేనేజర్ పూనమ్ గుప్తా చేసిన ధైర్యం వల్ల బ్యాంక్ డబ్బు సేఫ్ గా ఉందని ఆమెను అందరూ అభినందించారు.
Appreciation is must for this kind of courageous act.
Hats off to exemplary courage shown by Poonam Gupta, manager
Marudhara bank, Sriganganar. pic.twitter.com/p8pPgxPSBC— Dr Bhageerath Choudhary IRS (@DrBhageerathIRS) October 17, 2022