ఈ మద్య కొంత మంది చిన్న విషయాలకే మనస్థాపానికి గురై ఎదుటి వారిపై దాడుడు చేస్తున్న ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. ఇక మద్యం మత్తులో చేసే బీభత్సాలు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఓ వ్యక్తి విమానంలో మద్యం సేవించి ఆ మత్తులో నానా రచ్చ చేశాడు. అడ్డుపడిన సిబ్బందిలో ఓ వ్యక్తి వేలు కొరికేశాడు. ఈ ఘటన ఇండోనేషియాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
ఇస్తాంబుల్ నుంచి జకర్తాకు బయలు దేరిన టర్కిష్ ఎయిర్ లైన్స్ విమానంలో ఓ వ్యక్తి మద్యం సేవించి సిబ్బందితో గొడవ పెట్టుకున్నాడు. ఈ క్రమంలో విమాన సిబ్బంది అతన్ని వారించేందుకు చాలా ప్రయత్నించారు.. కానీ అతను మాత్రం వారిపై దాడి చేస్తూ నానా యాగీ చేశాడు. ఈ క్రమంలో అతన్ని కట్టడి చేసేందుకు సిబ్బందిలో ఒకడు అతనిపై చేయి చేసుకున్నాడు. అంతే తనకు కోపం తెప్పిస్తే ఏ ఒక్కరినీ వదిలే ప్రసక్తి లేదని వారిపై మరింత అటాక్ చేయడమే కాదు అందులో ఓ సిబ్బంది వేలు కొరికాడు. దీంతో అతనికి తీవ్ర రక్తస్రావం అయ్యింది. విమాన సిబ్బంది అలర్ట్ అయి కౌలాంలంపూర్ లో కి మళ్లించారు.
విమానాన్ని అత్యవసరంగా కౌలానాము విమానాశ్రయంలో ల్యాండింగ్ చేశారు. అయితే ఈ గొడవకు కారకకుడైన ప్రయాణికుడిని దించి.. గాయపడ్డ సిబ్బందిని విమానాశ్రయంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే విమానంలో గొడవ పడ్డ సదరు వ్యక్తి ఇండోనేషియాకు చెందినవాడని.. అతను కూడా ఓ పైలెట్ అని గుర్తించారు. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
Pesawat Turkish Airlines rute Istanbul-Jakarta harus dialihkan ke Medan gegara penumpang ngamuk dan serang kru. Pnp tsb akhirnya dihajar pnp lain dan kru sebelum diikat. Blm jelas akar permasalahannya apa sampai ybs menyerang kru pic.twitter.com/KrTrko6mTM
— #Pray4Kanjuruhan (@kabarpenumpang) October 12, 2022
ఇది చదవండి : ఒకేసారి బ్యాంక్ అకౌంట్లోకి కోట్లు వచ్చి పడ్డాయి! కట్ చేస్తే.. పోలీసులు రంగంలోకి!