ప్రభుత్వానికి చెల్లించవలసిన ట్యాక్స్ లు చెల్లించకుండా అక్రమంగా నల్లధనాన్ని కూడ బెడుతున్న నల్ల కుబేరులు రోజు రోజుకు పెరిగి పోతున్నారు. కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్న ధనవంతులు.. తాము చెల్లించవలసిన ఆదాయ పన్నును ఎగవేసి అక్రమ సంపాదనను మూటలు కట్టుకుంటున్నారు. ఏ విధంగానూ ఇబ్బంది లేకుండ చట్టానికి దొరకకుండా అత్యంత గోప్యంగా సురక్షితంగా నల్లధనాన్ని దాచి పెట్టకుంటున్నారు. అయితే ఇలాంటి వారిపై ఆదాయపు శాఖ అధికారులు ఎప్పటికప్పులు దాడులు జరిపి.. అవినీతి సొమ్మును స్వాధీనం చేసుకుంటున్నారు. అయినప్పటికీ ఇంకా కొందరు డబ్బులను అక్రమంగా దాచిపెడుతున్నారు. తాజాగా ఓ ఇద్దరు వ్యాపారుల ఇళ్లలో భారీ ఎత్తున డబ్బులు బయటపడ్డాయి. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో అన్నాదమ్ములైన శైలేష్ పాండే, అరవింద్ పాండేలు నివాసం ఉంటున్నారు. అక్టోబర్ 14న వీరిద్దరికి చెందిన కెనరా బ్యాంకు ఖాతాల్లోకి భారీ మొత్తంలో డబ్బులు బదిలీ అయ్యాయి. దాంతో బ్యాంకు అధికారులకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నార్దేంద్రపూర్ లో దొంగ పత్రాలతో పలు కంపెనీల పేరుతో ప్రారంభించి.. రెండు బ్యాంక్ ఖాతాల్లో కోట్లాది రూపాయల లావాదేవీలు జరిగినట్టు గుర్తించామని బ్యాంకు అధికారులు ఫిర్యాదులో పేర్కొన్నారు. అధికారులు ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు శనివారం అర్ధరాత్రి శైలేష్, అరవింద్ ల నివాసాలపై ఆకస్మిక తనిఖీలు చేశారు. అలాగే శిబ్పూర్ ప్రాంతంలోని వారికి చెందిన అపార్ట్‌మెంట్లలో తనిఖీలు చేశారు.
అపార్టమెంట్లోని అన్ని మూలల క్షుణంగా తనిఖీ చేశారు. ఆఖరికి అపార్టమెంట్ బయట ఉన్న కారును కూడా తనిఖీ చేశారు. అందులో రెండు కోట్లు కనిపించాయి. ఇక శైలేష్, అరవింద్ ల బెడ్ రూమ్ ల్లో మంచం కింద ఉండే స్టోరేజి బాక్సుల్లో రూ.6 కోట్లు కనిపించాయి. అలాగే డబ్బుతో పాటు అక్కడ బంగారు, వెండి ఆభరణాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే వారి రెండు బ్యాంకు ఖాతాల్లో సుమారు రూ.20 కోట్లు ఉన్నట్టు తెలిసింది. దాంతో వాటిని సీజ్ చేశారు. తీగ లాగితే డొంకంతా కదిలినట్టు.. ఆ ఇద్దరు వ్యాపారుల గుట్టును పోలీసులు బయటపట్టారు. వారు దాచిన కోట్లాది రూపాయలను స్వాధీనం చేసుకున్నారు.
Gold & Rs 2.5 crore recovered from a parked car in Howrah; businessman arrested.@Tamal0401 reports | #BreakingNews #Howrah #Kolkata pic.twitter.com/3nG4qsdRRo
— Mirror Now (@MirrorNow) October 17, 2022