ప్రస్తుతం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో అనేక విషయాలపై చర్చలు జరిగాయి. మరికొన్ని అంశాలపై చర్చలు నడుస్తున్నాయి. ఈ సందర్భంగా నటుడు, ఎంపీ బీజేపీ నేత రవి కిషన్ మాట్లాడుతూ.. తాను జనాభా నియంత్రణ బిల్లును ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. “జనాభా నియంత్రణ బిల్లు తీసుకు వచ్చినప్పుడే మనం విశ్వ గురువుల కాగలం. జనాభా నియంత్రణ అత్యావశ్యకం. ప్రస్తుతం మనం జనాభా విస్ఫోటనం దిశగా వెళ్తున్నాం. ఈ బిల్లు ప్రవేశపెట్టేలా విపక్ష పార్టీలు సహకరించాలి. నేను ఎందుకు ఈ బిల్లు పెట్టాలనుకుంటున్నానో వినాలని కోరుతున్నాను” అంటూ రవికిషన్ వెల్లడించారు. కేంద్రమంత్రులు కాకుండా పార్లమెంట్ సభ్యులు ప్రవేశపెట్టే వాటిని ప్రైవేటు బిల్లులు అంటారు. ఇప్పుడు రవికిషన్ ప్రవేశ పెట్టేది కూడా ప్రైవేటు బిల్లే. ఇదిలా ఉండగా.. ఈ బిల్లు ప్రవేశపెడతానని రవికిషన్ చెప్పగానే.. ఆయనపై నెగెటీవ్ కామెంట్స్ రావడం మొదలైంది.
వచ్చే ఏడాది నాటికి ప్రపంచలోనే అత్యధిక జనాభా గల దేశంగా చైనాను దాటి భారత్ నిలవనుందని ఐక్యరాజ్యసమితి అంచనా వేసిన సంగతి తెలిసిందే. జులై11న ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని 2022 ప్రపం జనాభా అంచనాల నివేదికను ఐరాస విడుదల చేసింది. ఈ నేపథ్యంలోనే ఈ బిల్లు తెరపైకి వచ్చింది. అయితే జనాభా నియంత్రణ బిల్లు గురించి బీజేపీ ఎంపీ రవికిషన్ ప్రస్తావించడంపై నెటిజన్లు ఆటాడుకున్నారు. “నలుగురు పిల్లల తండ్రివి.. జనాభా నియంత్రణ గురించి మాట్లాడుతున్నావా?” అంటూ ట్రోల్ చేశారు. ఎంపీ రవికిషన్‌కు ముగ్గురు కూతుళ్లు, ఒక కొడుకున్నారు. కూతుళ్లకంటే కొడుకు చిన్నవాడు కావడంపైనా కూడా నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపించారు.
కుమారుడు పుట్టేంత వరకు పిల్లల్ని కంటూనే ఉన్న మీరు జనాభా నియంత్రణకు ప్రైవేటు బిల్లు పెడతాననడం హాస్యస్పందంగా ఉందంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా, ఈ బిల్లును ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవడం లేదని మంగళవారం రాజ్యసభలో కేంద్రం స్పష్టంగా చెప్పింది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి భారతీ ప్రవీణ్ పవార్ ఈ సమాచారాన్ని అందించారు. రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
Father Of 4, Actor-BJP MP Ravi Kishan Calls For Population Control Bill https://t.co/roUPQRIA2C pic.twitter.com/B98z80BkFe
— NDTV News feed (@ndtvfeed) July 22, 2022
We can be Vishwa Guru only when Population Control Bill is brought. Very imp to bring population under control. With the way in which it’s rising, we’re heading towards explosion.I request Oppn to let me introduce Bill & listen to why I want to do it. Discuss!: BJP MP Ravi Kishan pic.twitter.com/9jz32k9Vmk
— ANI (@ANI) July 22, 2022
ఇదీ చదవండి: తన కోడింగ్ నైపుణ్యంతో విజేతగా నిలిచిన భారత కుర్రాడు! కానీ..జాబ్ రిజెక్ట్ చేసిన అమెరికా కంపెనీ..
ఇదీ చదవండి: Justice NV Ramana: సోషల్ మీడియాపై సీజేఐ ఎన్వీ రమణ సీరియస్ కామెంట్స్!