రవి కృష్ణ మొగలి రేకులుతో దుర్గగా మారాడు. అనంతరం వరూధిణి పరిణయం, మనసు-మమత, ఆమె కథ పలు సీరియల్స్‌లో సాఫ్ట్ క్యారెక్టర్ చేస్తూ మహిళల ఆదరణ చూరగొన్నాడు. విరూపాక్షతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు ఈ విజయవాడ కుర్రాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడుు.
ఇటీవల బుల్లి తెర నటులు.. వెండి తెరపైన కూడా సత్తా చాటుతున్నారు. అటువంటి వారిలో ఒకరు రవి కృష్ణ. విరూపాక్షతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు ఈ విజయవాడ కుర్రాడు. యాక్టింగ్ మీద ఫ్యాషన్‌తో సినిమా పరిశ్రమలోకి వచ్చి అసిస్టెంట్ డైరెక్టర్‌గా మారాడు. అనంతరం బుల్లితెరపై మొగలి రేకులుతో దుర్గగా మారాడు. అనంతరం వరూధిణి పరిణయం, మనసు-మమత, ఆమె కథ పలు సీరియల్స్‌లో సాఫ్ట్ క్యారెక్టర్ చేస్తూ మహిళల ఆదరణ చూరగొన్నాడు. ఆ తర్వాత బిగ్ బాస్‌లోకి వచ్చి ఫేమస్ అయ్యాడు. అయితే ఈ మధ్యలో సీరియల్ సహనటి నవ్వస్వామితో ప్రేమాయణం అంటూ వార్తల్లో నిలిచాడు. అయితే ఇటీవల సుమన్ టీవీ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
తన తండ్రి ఆర్టీసీ డ్రైవర్ అని, మేము ముగ్గురు పిల్లలమని చెప్పారు. తాను ఒక్కడినే కొడుకు కావడంతో.. సినిమాల వైపు వెళుతుంటే తన తండ్రి భయపడ్డారని తెలిపారు. నవ్య స్వామితో వచ్చిన రిలేషన్ గురించి మాట్లాడుతూ.. తను బెస్టెస్ట్ ఫ్రెండ్ అని చెప్పారు. ‘ లాస్ట్‌గా తనతోనే సీరియల్ చేశాను. అప్పటి నుండి సీరియల్ చేయలేదు. ఏదైనా షోకి పిలవాలనుకున్నప్పుడు.. ఒక జంట కావాలనుకున్నప్పుడు, మాది హిట్ పెయిర్ కావడంతో పిలిచేవారు. జనాలు కూడా వీరిద్దరే పెయిర్ అని ఫీలయ్యారు. తనకు, నాకు కంఫోర్ట్ జోన్ కావడంతో కంటిన్యూ అయ్యాం. బెస్ట్ ఫ్రెండ్, చూసేవాళ్లకేమో లవర్స్ అన్న ఫీలింగ్’అని తెలిపారు. ప్రతిరోజూ టచ్ లో ఉంటామని రవికృష్ణ అన్నారు.
మీతో కాకుండా మరో పెయిర్‌తో యాక్టింగ్ చేస్తుంటే.. అంత సెట్ కాలేదని ఆడియన్స్ అంటున్నారన్న మాటకు..‘అదీ కామన్‌గా ఉంటుంది. వరూధిని పరిణయం సీరియల్ చేసినప్పుడు వరూధిని, పార్థుని అలాగే అన్నారు.’అని వ్యాఖ్యానించారు. నవ్యస్వామి ఒకవేళ ప్రపోజ్ చేస్తే మాత్రం అప్పుడు చూద్దామని ఆయన తెలిపారు.నవ్యస్వామితో ప్రేమ, పెళ్లి తనకు ఇష్టమేనని పరోక్షంగా రవికృష్ణ పేర్కొన్నారు.మూవీ స్టైల్ కు అనుగుణంగా నేను మారానని ఆయన తెలిపారు.