గోద్రా అల్లర్ల సమయంలో జరిగిన బిల్కిస్ బానో సామూహిక అత్యాచారం కేసులోని దోషులను గుజరాత్ ప్రభుత్వం క్షమాభిక్ష కింద విడుదల చేసింది. వారి విడుదల ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయంగా మారింది. అత్యాచార, హత్య కేసులో దోషులను..ఈ విధానం కింద విడుదల చేయరాదని కేంద్రం మార్గదర్శకాలు విడుదల చేసినప్పటికీ సుప్రీంకోర్టు సూచన మేరకు గుజరాత్ సర్కారు క్షమాభిక్ష పెట్టింది. సోమవారం జైలు నుంచి విడుదలైన 11 మందికి వీహెచ్ పీ కార్యాలయంలో పూలమాల వేసి ఘనస్వాగతం పలికారు.
బిల్కిస్ బానో సామూహిక అత్యాచారం కేసులో విడుదలై 11 మంది దోషులకు జైలు బయట వారి కుటుంబ సభ్యులతో పాటు కొంత మంది అనురచరులు అక్కడి చేరుకున్నారు. విడుదలైన వారి పాదాలను తాకడం మరియు వారికి స్వీట్ అందించే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బిల్కిస్ బానో కేసులో 2008 జనవరి 21న ముంబైలోని ప్రత్యేక సీబీఐ కోర్టు 11మంది నిందితులకు జీవిత ఖైదు విధించింది. ఆ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ బాంబే హైకోర్టుల్లో దోషుల తరపున పిటిషన్ వేశారు. బాంబే హైకోర్టు కూడా కింది కోర్టు వేసిన శిక్షను సమర్థించింది. ఈ దోషులు 15 ఏళ్లకు పైగా జైలు శిక్ష అనుభవించారు.
ఆ తర్వాత వారిలో ఒకరు తనను ముందస్తుగా విడుదల చేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.అతని శిక్షను తగ్గించే అంశాన్ని పరిశీలించాలని గుజరాత్ ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. దీంతో గుజరాత్ ప్రభుత్వం పంచమహల్స్ కలెక్టర్ సుజల్ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. బిల్కిస్ బానో కేసులోని 11 మంది దోషులను విడుదల చేసేందుకు ఆ కమిటీ ఏకగ్రీవ నిర్ణయం తీసుకుంది. కమిటీ నిర్ణయంతో రాధేశ్యామ్ షా, జస్వంత్ చతుర్భాయ్ నాయ్, కేశుభాయ్ వదానియా, బకాభాయ్ వదానియా, రాజీభాయ్ సోనీ, రమేష్‌భాయ్ చౌహాన్, శైలేష్‌భాయ్ భట్, బిపిన్ చంద్ర జోషి, గోవింద్‌భాయ్ నాయ్, మితేష్ భట్, ప్రదీప్ మోధియా అనే 11 మంది సోమవారం జైలు నుండి బయటకి వచ్చారు.
బిల్కిస్ బానో కేసు వివరాల్లోకి వెళ్తే.. మార్చి 3, 2002న గోద్రా అనంతర అల్లర్ల సమయంలో దాహోద్ జిల్లాలోని లిమ్ఖేడా తాలూకాలోని రంధిక్పూర్ గ్రామంలో బిల్కిస్ బానో కుటుంబ సభ్యులపై ఒక గుంపు దాడి చేసింది. సబర్మతి ఎక్స్‌ప్రెస్ రైలు దహనం ఘటన తర్వాత చెలరేగిన హింసాకాండ నుంచి తప్పించుకునే సమయంలో బిల్కిస్ బానో కుటుంబం దాడి జరిగింది. ఆమె కుటుంబ సభ్యులను రేప్ చేసి దారుణంగా చంపారు. తాజాగా రేప్ చేసి చంపి జీవిత ఖైదు పడ్డ వారిని విడుదల చేయడం దుమారం రేపుతుంటే వారు ఏకంగా స్వీట్లు పంచుకొని పండుగ చేసుకోవడం బాధితుల కడుపు మండేలా ఉంది. మరి.. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలిజేయండి.
Bilkis case convicts garlanded at VHP office.#ITVideo #BilkisBanoCase| @Chaiti pic.twitter.com/ah9T1Olmil
— IndiaToday (@IndiaToday) August 17, 2022