Goodfellows: రతన్ టాటా.. ఈ దేశంలో ఆయన పేరు తెలియని వారు దాదాపు ఉండరు. వ్యాపార వేత్తగానే కాదు.. సామాజిక వేత్తగానూ ఆయన సుపరిచితులు. రతన్ టాటా తన కంపెనీ సంపాదనలోని పెద్ద మొత్తాన్ని సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తూ ఉంటారు. కరోనా సమయంలోనూ ఎన్నో సేవాకార్యక్రమాలు చేపట్టారు. దాదాపు 1000కోట్లకు పైగా ప్రభుత్వానికి విరాళంగా ఇచ్చారు. తాజాగా, మరో అద్బుతమైన కార్యక్రమానికి టాటా అండగా నిలిచారు. ఆ కార్యక్రమమే ‘‘ గుడ్ ఫెలోస్’’. దీన్ని టాటా మిత్రుడు శాంతను నాయుడు రూపొందించారు. గుడ్ ఫెలోస్ ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే.. ముసలి వాళ్లకు తోడుగా, స్నేహితులుగా యువతీ, యువకులను ఉంచటం. సదరు యువతీ, యువకులు వృద్ధులకు తోడుగా ఉంటారు. మేము ఒంటి వాళ్లం అన్న భావన వృద్ధులకు కలుగకుండా చూసుకుంటారు. ‘గుడ్ ఫెలోస్’ వృద్ధులకు సహాయపడే ఇండియాలోనే మొదటి కాంపానియన్‌షిప్ స్టార్టప్ కావటం విశేషం. ఇక, ‘గుడ్ ఫెలోస్’పై టాటా మాట్లాడుతూ.. ‘‘ మీకు తెలీదు.. ఒంటిరి తనం అంటే ఏంటో.. అది మీ అనుభవంలోకి వస్తేనే తెలుస్తుంది. తోడు కోసం కోరుకుంటే తెలుస్తుంది’’ అని అన్నారు. ఈ కార్యక్రమానికి ఆర్థిక సాయం కూడా అందిస్తున్నారు. కాగా, రతన్ టాటా, తమిళ నాడుకు చెందిన శాంతను నాయుడు జంతు ప్రేమికులు. ఆ ప్రేమే వీరిద్దరినీ దగ్గర చేసింది. వయసులో చాలా వ్యత్యాసం ఉన్నా టాటా, శాంతను మంచి ఫ్రెండ్స్‌గా మారారు. ఆ ఫ్రెండ్షిప్ ఇప్పటికీ కొనసాగుతోంది. వీరిద్దరూ కలిసి ఎన్నో సేవా కార్యక్రమాలను రూపొందించారు. మరి, వృద్ధుల కోసం రతన్ టాటా, శాంతను నాయుడు చేపట్టిన ‘గుడ్ ఫెలోస్’పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. Ratan Tata: How Shantanu Naidu’s Goodfellows India’s 1st Companionship Startup helps Senior Citizens #NewsMo #RatanTata #Startup #Goodfellows pic.twitter.com/sOexvDZy0L — IndiaToday (@IndiaToday) August 17, 2022 ఇవి కూడా చదవండి: హీరో మాధవన్ తన ఇల్లు అమ్మి ‘రాకెట్రీ’ సినిమా తీశాడా? జరిగిందేంటి?