మనలో చాలా మందికి రకరకాల ఫోబియాలుంటాయి. కొందరకి కుక్కలు, పిల్లులు, బొద్దింకలు, బల్లులు వంటి వాటిని చూస్తే భయం. మరికొందరికి ఎత్తైన ప్రదేశాలు, నీళ్లు చూస్తే భయం. ఇలా ప్రతి మనిషికి ఏదో రకమైన భయం ఉంటుంది. ఇక చాలా వరకు మనుషులు తమ అపోజిట్ జండర్ వ్యక్తులతో మాట్లాడాలంటే భయపడతారు. ఈ భయం ఎక్కువగా అమ్మాయిల్లో ఉంటుంది. అయితే ఇప్పుడు మీరు చదవబోయే స్టోరీ కూడా ఈ కోవకు చెందినదే. ఇక్కడ ఓ ఇంటర్ విద్యార్థి.. తన చుట్టూ ఒకేసారి ఏకంగా 500 మంది అమ్మాయిలను చూసి బిక్క చచ్చిపోయాడు. తనచుట్టూ అంతమంది అమ్మాయిలను చూసి స్పృహ తప్పి పడిపోయాడు. ఈ వింత సంఘటన బిహార్‌లో చోటు చేసుకుంది. ఆ వివరాలు..
బిహార్ సుందర్‌గఢ్‌కు చెందిన 17 ఏళ్ల మనీశ్ శంకర్ అనే విద్యార్థి స్థానిక అల్లామా ఇక్బాల్ కాలేజీలో ఇంటర్ చదువుతున్నాడు. ఇక బోర్డు ఎగ్జామ్స్ ప్రారంభం కావడంతో.. పరీక్ష రాయడం కోసం సుందర్‌గఢ్‌లోని తన ఎగ్జామ్ సెంటర్ బ్రిలియంట్ కాన్వెంట్ స్కూల్ దగ్గరకు వెళ్లాడు. తండ్రి సచ్చిదానంద్ ప్రసాద్ వచ్చి మనీశ్‌ను ఎగ్జామ్ సెంటర్ దగ్గర దింపి వెళ్లాడు. ఇక పరీక్ష రాసేందుకు మనీశ్.. ఎగ్జామ్ హాల్‌లోకి వెళ్లాడు. అక్కడ అందరూ బాలికలు ఉండటంతో.. ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయాడు. తన చుట్టూ సుమారు 500 మంది విద్యార్థినిలు.. వారి మధ్యలో తను ఒక్కడు మాత్రమే అబ్బాయి కావడంతో.. కంగారుపడి సొమ్మసిల్లి పడిపోయాడు.
మనీశ్ పరిస్థితి చూసి ఎగ్జామ్ సెంటర్ నిర్వాహకులు కంగారు పడ్డారు. వెంటనే అతడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మనీశ్‌ను ఆస్పత్రికి తరలించారు. చికిత్స తర్వాత మనీశ్ కోలుకున్నాడు. దాంతో అతడి కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ సందర్భంగా మనీశ్ మేనత్త మాట్లాడుతూ.. ‘‘బ్రిలియంట్ కాన్వెంట్ స్కూల్ ఎగ్జామ్ సెంటర్‌లో సుమారు 500 మంది కంటె ఎక్కువ మంది విద్యార్థినులు ఉన్నారు. నా మేనల్లుడికి ఆ పాఠశాలలోని మెయిన్ హాలులో సీటు కేటాయించారు. ఒక్కసారిగా తన చుట్టూ అంత మంది విద్యార్థినిలను చూసి మనీశ్ కంగారు పడ్డాడు. అందుకే స్పృహ తప్పి పడిపోయాడు’’ అని తెలిపింది. ఈ వార్త తెలిసి పాపం మనీశ్ అంటున్నారు జనాలు. మరి మనీశ్ పరిస్థితి చూసి మీరు ఎలా ఫీలవుతున్నారు.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
बिहार बोर्ड की 12वीं की परीक्षा के दौरान हुई अजीबोगरीब घटना | Unseen India pic.twitter.com/5awOkkjK6L
— UnSeen India (@USIndia_) February 1, 2023