దేశంలో అక్షరాస్యత రేటులో ప్రతిసారి ముందుంటుంది కేరళ రాష్ట్రం. ఇక్కడ చదువుకి వయసుతో సంబంధం లేదని రుజువు చేసింది 107 ఏళ్ల భగీరథీ బామ్మ. ఇక వయసు మీద పడుడుతున్న చదువుపట్ల ఇష్టం తగ్గకపోవడంతో 105 ఏళ్ల వయసులో నాలుగో తరగతి పూర్తి చేసింది. దీంతో పాటు కేంద్రం నుంచి నారీశక్తి అవార్డును కూడా అందుకుని రికార్డ్ నెలకొల్పింది భగీరథీ బామ్మ. ఇక వయసుతో పాటు మరణం తన్నుకురావడంతో బామ్మ నేడు కన్నుమూసింది అసలు ఎవరు ఈ బామ్మ?.. 105 ఏళ్ల వయసులో చదువుకోవడమేంటి? ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనుందా..?
ఇక వివరాల్లోకి వెళ్తే…ఆమె పేరు భగీరథీ. కేరళ రాష్ట్రం కొలాం జిల్లా ప్రక్కులం వాసి. చిన్నప్పటి నుంచి చదువుకోవాలని ఆశగా ఉన్నా..అప్పట్లో కుటుంబ పరిస్థితులు అనుకూలించకపోవడంతో చదువును చిన్నప్పుడే వదిలేసింది. ఆ తర్వాత పెళ్లి పిల్లలు సగం జీవితం అయిపోయింది. చదువుకోవాలనే అశ మాత్రం ఇంకా తట్టిలేపుతూనే ఉంది. ఎలాగైనా చదువుకోవాలని 105 సంవత్సరాల వయసులో నాలుగో తరగతి పూర్తి చేసి 74.5 శాతం మార్కులతో రికార్డు సృష్టించింది. దీంతో అప్పట్లో ఈ బామ్మ పేరు దేశ వ్యాప్తంగా గుర్తింపుని పొందింది.
ఇక ఈ బామ్మను కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించి నారీ శక్తి అవార్డును ప్రకటించింది. ఇక స్థానికంగా కూడా బామ్మను ప్రత్యేకంగా అభినందించారు. ఇప్పటికి 107 ఏళ్ల వయసు నిండటంతో భగీరథీ నేడు కన్నుమూసింది. ఇక ఆమె మరణ వార్త విన్న ఎంతో మంది ప్రముఖులు నివాళులు అర్పించారు. ఇక బామ్మ మృతిపై ప్రధాని నరేంద్ర మోడీ కూడా సంతాపం ప్రకటించారు. ఇలా చదువుకోవడంలో వయసుతో సంబంధం లేదని నేటి సమాజానికి ఓ చక్కని పాఠాన్ని నేర్పింది భగీరథీ బామ్మ. ఇక దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.