వైద్య రంగంలో ఇప్పుడు ఎన్నో అద్భుతమైన ప్రయోగాలు జరుగుతున్నాయి.. మనిషి ప్రాణం పోతే తిరిగి తీసుకు రావడం తప్ప.. బతికించేందుకు ఎన్నో రకాల ప్రయోగాలు చేస్తూ విజయం అందుకుంటున్నాడు.
ప్రపంచంలో టెక్నాలజీ పెరుగుతున్నా కొద్ది మనిషి ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్నారు. భూమి, ఆకాశం, సముద్రం ఏక్కడ చూసినా తన ఆదిపత్యాన్ని చాటుతున్నాడు. వైద్యరంగంలో ఎన్న ప్రయోగాలు చేస్తున్నారు. సృష్టికి ప్రతి సృష్టి చేస్తున్నారు. ప్రాణం పోయిన మనిషిని బతికించడం తప్ప వైద్యరంగంలో అన్ని ప్రయోగాలు చేస్తున్నారు. ప్రమాదవశాత్తు మణికట్టు తెగిపోయిన పూర్తిగా విడిపోయిన చేతిని శస్త్ర చికిత్స తో విజయవంతంగా అతికించారు. ఈ అద్బుత ఘటన బెంగుళూరులో జరిగింది. వివరాల్లోకి వెళితే..
బెంగుళూరులోని ఓ ఫ్యాక్టరీలో మేనజర్ గా విధులు నిర్వహిస్తున్నాడు ఓ వ్యక్తి. ఇటీవల ఆ ఫ్యాక్టరీకి కొత్త యంత్రాలు వచ్చాయి. వాటి పనితీరును పరిశీలించేందుకు ఆ వ్యక్తి యంత్రాల వద్దకు వెళ్లాడు.. అనుకోకుండా అతని కుడిచేయి మిషిన్ లో పడిపోయింది. దాంతో మణికట్టు వరకు పూర్తిగా తెగిపోయింది. బాధితుడిని వెంటనే బెంగుళూరు లోని బన్నెరుఘట్ లోని ఫోర్టీస్ హాస్పిటల్ కి తరలించారు. అక్కడ వైద్యులు ఏడు గంటల పాటు ఎముక, కండరాలు, రక్తనాళాలు, నరాలు అన్నింటినీ సూక్ష్మశస్త్రచికిత్స పద్ధతులను ఉపయోగించి ఆపరేషన్ విజయవంతం చేశారు. ఇలాంటి కేసులు చాలా రేర్ గా వస్తుంటాయని.. ఎంతో క్లిషమైన శస్త్రచికిత్సను వైద్య బృందం విజయవంతంగా పూర్తి చేయడం ఎంతో ఆనందంగా ఉందని డాక్టర్ సత్య వంశీ కృష్ణ వెల్లడించారు.
ఆ మద్య హైదరాబాద్ లో కూడా ఇలాంటి ఓ అద్భుతం జరిగింది. పూర్తిగా తెగిపోయిన ఎడమ అరచేతిని శస్త్ర చికిత్స చేసి మళ్లీ అతికించి ఓ యువకుడికి నూతన జీవితాన్ని ప్రసాదించారు మాదాపూర్ మెడికవర్ వైద్యులు. రాజస్థాన్ కి చెందిన ఓ యువకుడు అల్యూమీనియం కట్టింగ్ మెషన్ తో పనిచేస్తుండగా ప్రమాద వశాత్తు ఎడమ చేయి అందులో పడి తెగిపోయింది. సిబ్బంది, కుటుంబ సభ్యులు అతన్ని హైటెక్ సిటీ మెడికవర్ హాస్పిటల్ కి తీసుకు వచ్చారు. గాయపడిన చేతి అన్ని నిర్మాణాలకు మొదట రక్త ప్రవాహం అందేలా ఏర్పాటు చేసి తర్వాత తెగిపోయిన అరచేతిని ఐదు గంటల పాటు శస్త్రచికిత్స చేూసి అతికించారు. ఇలాంటి మెరాకిల్స్ వైద్యరంగంలో ఎన్నో జరుగుతున్నాయని వైద్యులు అంటున్నారు.