ఆన్ లైన్ లో డేటింగ్ యాప్ ల పేరుతో అనేక మోసాలు జరుగుతున్నాయి. ఈ డేటింగ్ యాప్ ల ద్వారా కొందరు.. యువతులను ఎర వేసి యువకులను, ఉద్యోగులను, ధనవంతులను ట్రాప్ చేస్తుంటారు. అనంతరం పెద్ద మొత్తంలో డబ్బులు కాజేస్తారు. ఇలాంటి వార్తలు నిత్యం వినిపిస్తుంటాయి. అయినా కొందరు మాత్రం ఆ డేటింగ్ యాప్ ల వెంటపడటం మానుకోవడం లేదు. తాజాగా బెంగళూరులో ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. ఆన్ లైన్ లో పరిచయమైన యువతి వలో చిక్కి బ్యాంకు మేనేజర్ బ్యాంకులో ని రూ.5.70 కోట్ల డబ్బులను ఆమెకు ముట్టజెప్పి.. ఇప్పుడు కటకటాలు లెక్కపెట్టుకుంటున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
బెంగళూరు లోని హనమంతనగర్‌లో ఉన్న ఓ బ్యాంకు శాఖలో హరిశంకర్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. మూడు నెలల క్రితం డేటింగ్ యాప్ ద్వారా అతడికి ఓ యువతి పరిచయమైంది. ఈ క్రమంలో ఓ రోజు ఆ యువతి వలపు మాటలతో.. తనకు అత్యవసరంగా డబ్బులు కావాలని అడగడంతో మరో ఆలోచన లేకుండా తన ఖాతాలో ఉన్న రూ.12 లక్షలను మేనేజర్ హరిశంకర్ పంపించారు. అంతటితో ఆగక హరిశంకర్ యువతి మైకంలో పలుమార్లు ఆమె అడగటమే ఆలస్యం వెంటనే బ్యాంకులోని డబ్బులు ఇస్తు వచ్చాడు. అలా బ్యాంకులోని ఓ ఖాతాదారుడి డిపాజిట్ నుంచి పలు విడతలుగా ఏకంగా రూ. 5.70 కోట్లు ఓవర్ డ్రాఫ్ట్ (OD) చేశాడు. ఇలా వారం వ్యవధిలోనే ఆరు రోజుల వ్యవధిలో 136 సార్లు ఓడీ చేయడంతో అనుమానించిన ఉన్నతాధికారులు ఆరా తీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. బ్యాంకు రీజనల్ మేనేజర్ డీఎస్ మూర్తి ఫిర్యాదు మేరకు మేనేజర్ హరిశంకర్, అసిస్టెంట్ మేనేజర్ కౌసల్య, క్లర్క్ మునిరాజుపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు హరిశంకర్‌ను అరెస్ట్ చేసి కటకటాలోకి పంపారు.
బ్యాంకు అధికారులు చేపట్టిన విచారాణలో .. పశ్చిమ బెంగాల్‌లోని పలు బ్యాంకులకు చెందిన 28 అకౌంట్లకు, కర్ణాటకలోని రెండు బ్యాంకు అకౌంట్ల ఈ 136 లావాదేవీల ద్వారా నిధులు మళ్లించినట్లు తేలింది. ఈ క్రమంలో హరిశంకర్ తన ఇద్దరు సహచరులైన అసిస్టెంట్ మేనేజర్ కౌసల్య, క్లర్క్ మునిరాజులను కూడా ఉపయోగించుకున్నారని అధికారులు గుర్తించారు. అయితే, ఈ ఘటనలో వారి ప్రమేయాన్ని అధికారులు ఇంకా నిర్ధారించలేదు. కేసు దర్యాప్తును చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. మరొకవైపు ముసుగులో తాను సైబర్ క్రిమినల్స్ చేతిలో మోసపోయినట్టు హరిశంకర్ ఆవేదన వ్యక్తం చేశారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: LIC నుంచి అద్భుతమైన పాలసీ.. రూ.253 తో 55 లక్షల రూపాయలు పొందే అవకాశం!