వర్షాల కారణంగా బెంగుళూరు మహా నగరంలో ఇళ్లు, వాకిళ్లు నీట మునిగిపోయాయి. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానల కారణంగా ఐటీ కారిడార్ సహా అనేక ఏరియాలు, రోడ్లు జలమయమయ్యాయి. ఇళ్లలోకి, రోడ్లపైకి భారీగా నీరు చేరడంతో జనాలు బాగా ఇబ్బందులకు గురవుతున్నారు. రోడ్లపైకి నీరు చేరడంతో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొన్ని చోట్ల అయితే ప్రమాదానికి గురవుతున్నారు. ఓ యువతి రోడ్డుపై వెళ్తుండగా పొరపాటున కరెంట్ పోల్ ని పట్టుకుంది. దీంతో ఆమె కరెంట్ షాక్ తగిలి అక్కడిక్కడే మృత్యువాత పడింది. బెంగుళూరులోని వైట్ ఫీల్డ్ సమీపంలో సోమవారం రాత్రి 9.30 నిమిషాల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అఖిల అనే 23 ఏళ్ల యువతి ఒక స్కూల్ లో అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్ మెంట్ లో పని చేస్తుంది.
పని ముగించుకుని స్కూల్ నుంచి ఇంటికి తన స్కూటీ మీద బయలుదేరింది అఖిల. వరద నీరు రోడ్లని ముంచెత్తడంతో ఆమె స్కూటీ స్కిడ్ అయ్యింది. పడిపోకుండా ఉండడం కోసం పక్కనే ఉన్న కరెంట్ స్తంభాన్ని పట్టుకుంది. ఆ స్థంభానికి కరెంట్ పాస్ అవ్వడంతో ఆ యువతి షాక్ తగిలి కింద పడిపోయింది. గమనించిన స్థానికులు వెంటనే యువతిని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే యువతి మరణించినట్లు వైద్యులు తెలిపారు. కాగా తమ కూతురు మరణానికి బెంగుళూరు విద్యుత్ అధికారులు, మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యమే కారణమని.. విధులను సరిగా నిర్వర్తించకపోవడం వల్లే ఇలా జరిగిందని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయమేంటో కామెంట్ రూపంలో తెలియయజేయండి.
Bengaluru: 23-Year-Old girl electrocuted due to waterlogging and negligence by civic bodies. @harishbijoor speaks to India Today on the issue #ITVideo #BengaluruRains (@PoojaShali) pic.twitter.com/1lorEFNgXz
— IndiaToday (@IndiaToday) September 6, 2022