తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. వాగులు, నదులు, జలపాతాలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో భారీగా వాననీరు వచ్చి జనజీవనం అస్తవ్యస్తం అవుతుంది. ప్రజలు భయటికి రావడానికి జంకుతున్నారు.
తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. వాగులు, నదులు, జలపాతాలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో భారీగా వాననీరు వచ్చి జనజీవనం అస్తవ్యస్తం అవుతుంది. ప్రజలు భయటికి రావడానికి జంకుతున్నారు. పలుచోట్ల రోడ్లు, వంతెనలు కూడా నీట మునిగిపోయాయి. దాదాపు వారం రోజులుగా కురుస్తున్న వానలకు రాష్ట్రం అతలాకుతలం అవుతోంది. గత మూడురోజులుగా ఎడతెరిపి లేకుండా అతి భారీ వర్షాలతో హైదరాబాద్‌లో కూడా చాలా కాలనీలు నీట మునిగాయి. ప్రజల పరిస్థితి దయనీయంగా మారింది. అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. తెలంగాణలో పలు జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. విద్యాసంస్థలకు సెలవులు కూడా ప్రకటించారు. మరిన్ని వివరాల్లోకి వెళితే..
భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో వరద బీభత్సం సృష్టించింది. మొరంచపల్లిలో వరద కారణంగా ఊరి ప్రజలు జలదిగ్బంధంలో చిక్కుకున్నారు. వారిని రక్షించేందుకు రాష్ట్రప్రభుత్వం చర్యలు చేపడుతోంది. వరద కారణంగా మొరంచెపల్లికి చెందిన గొర్రొ ఒదిరెడ్డి, గొర్రె వజ్రమ్మ, మహాలక్ష్మి, సరోజన వాగులో కొట్టుకుపోయారు. మారేడుకొండ చెరువు తెగి పోవడంతో వదర ఉధృతికి బండ్ల సారయ్య ఇల్లు కొట్టుకుపోయి ఇంట్లోని ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు. సారయ్య చనిపోగా సమ్మక్క గల్లంతు అయ్యింది. ఏటూరునాగారం కొండాయిలో దయ్యాల వాగు వరదలో రశీద్, షరీఫ్, అజ్జు, మహబూబ్ ఖాన్, మరో ఆరుగురు గల్లంతయ్యారు. ఐటీడీఏ పరిధిలోని ఎస్టీ గురుకుల విద్యాలయం గ్రౌండ్ ఫ్లోర్ పూర్తిగా వరదలో మునిగిపోయింది. ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి గురువారం జంపన్న వాగులో గల్లంతయ్యారు. వారిలో బాలుడి మృతదేహం లభ్యమైంది.
జంపన్న వాగు ఉగ్రరూపం దాల్చింది. కొండాయి, మాల్యాల గ్రామాలను ముంచేసింది. వరద తాకిడికి జంపన్న వాగులో ఏడుగురు గల్లంతయ్యారు. నలుగురి డెడ్‌బాడీలు లభ్యమయ్యాయి. మిగతా ముగ్గురికోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. వరంగల్ జిల్లాలో ఎడతెరిపిలేని వర్షాల కాలణంగా ఎటు చూసినా వరదలే. వాగులు, నదులు పొంగిపొర్లుతున్నాయి. మెదక్ పట్టణంలోని మిలటరీ కాలనీలో గురువారం తెల్లవారు జామున ఇల్లు కూలి గర్భిణి తీవ్రంగా గాయపడింది. గర్భణి కడుపులోని శిశువు చనిపోయింది. ఇంట్లో నిద్రిస్తున్న యాసిన్ బేగం పొట్టమీద ఇంటి పెంకులు పడి ఈ ఘోరం జరిగింది. చికిత్స కోసం మెదక్ ఆస్పత్రి నుండి హైదరాబాద్ కు తరలించగా అప్పటికే శిశువు చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. సర్జరీ చేసి చనిపోయిన శిశువును తీసేశారు. యువతి చికిత్స పొందుతుంది.