తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. వాగులు, నదులు, జలపాతాలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో భారీగా వాననీరు వచ్చి జనజీవనం అస్తవ్యస్తం అవుతుంది. ప్రజలు భయటికి రావడానికి జంకుతున్నారు.
గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా అతి భారీ వర్షాలతో తెలంగాణ రాష్ట్రం అతలాకుతలం అవుతుంది. చాలా గ్రామాలు నీట మునిగాయి. నదులు, వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ప్రజల పరిస్థితి దయనీయంగా మారింది. అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. తెలంగాణలో పలు జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు.
ప్రస్తుతం అనంతపురంలో ఎక్కడ చూసినా భారీ వర్షాల కారణంగా ఇళ్ళు, వాకిళ్ళూ, రోడ్లు నీట మునుగుతున్నాయి. మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న చాలా కాలనీలు నీట మునిగాయి. యాలేరు, ఆలమూరు చెరువుల నుంచి వచ్చిన వరద నీరు కారణంగా అనంతపురం నగరం మొత్తం నీట మునిగింది. చాలా ప్రదేశాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే అధికారులు అప్రమత్తం […]
వర్షాల కారణంగా బెంగుళూరు మహా నగరంలో ఇళ్లు, వాకిళ్లు నీట మునిగిపోయాయి. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానల కారణంగా ఐటీ కారిడార్ సహా అనేక ఏరియాలు, రోడ్లు జలమయమయ్యాయి. ఇళ్లలోకి, రోడ్లపైకి భారీగా నీరు చేరడంతో జనాలు బాగా ఇబ్బందులకు గురవుతున్నారు. రోడ్లపైకి నీరు చేరడంతో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొన్ని చోట్ల అయితే ప్రమాదానికి గురవుతున్నారు. ఓ యువతి రోడ్డుపై వెళ్తుండగా పొరపాటున కరెంట్ పోల్ ని పట్టుకుంది. దీంతో […]
గత కొన్ని రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాలను వణికించిన వరుణుడు.. ప్రస్తుతం కర్ణాటకపై తన ప్రభావాన్ని చూపుతున్నాడు. భారీ వర్షాలతో కర్ణాటక చిగురుటాకులా వణికిపోతుంది. మరీ ముఖ్యంగా బెంగళూరును వరదలు ముంచెత్తుతున్నాయి. వీధులన్ని మునిగిపోయాయి. పలు ప్రాంతాల్లో వరదల ధాటికి వాహనాలు కొట్టుకుపోయాయి. ఇక నదులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో చాలా చోట్ల లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. ఇక భారీ వరదల కారణంగా పలు పాంత్రాల్లో గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అయ్యింది. కొన్ని ప్రాంతాల్లోసుమారు ఐదు గంటలకు […]
పాకిస్తాన్‌లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఆ దేశంలోని దాదాపు సగానికి పైగా ప్రాంతాలు నీట మునిగాయి. దేశంలోని 160 జిల్లాలకు గాను 110 జిల్లాల్లో వరదలు వచ్చినట్లు పాక్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ తెలిపింది. వరదల కారణంగా భారీ ఆస్తి నష్టం, ప్రాణ నష్టం సంభవించింది. సుమారు 11 వందల మంది మరణించినట్లు అధికారులు చెబుతున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం […]
రెండు తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరపి లేని వర్షాల కారణంగా వాగులు, వంకలు, నదులు పొంగి పొర్లుతున్నాయి. భారీ వర్షాల కారణంగా.. గోదావరి నది పరివాహక ప్రాంత ప్రజలు వరదలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ వరదలు భారీ ఆర్థిక నష్టాలను మిగిల్చాయి. వరదల కారణంగా ఇప్పటికే పలు ప్రాంతాల్లో రోడ్లు కొట్టుకుపోయి.. రవాణా సదుపాయాలు లేక కష్టపడుతున్నారు. వరద బీభాత్సానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరలవుతున్నాయి. ఈ […]
భారీ వర్షాల కారణంగా వరద ఉదృతి ఎంత దారుణంగా ఉందో గత కొన్ని రోజులుగా మనం చూస్తూనే ఉన్నాం. నదీ జలాలు, చెరువులు నిండిపోవడంతో ఎటూ దారి లేక ఆ వరద నీరంతా రోడ్లపైకి వస్తుంది. దీంతో రోడ్లన్నీ జలాశయాలుగా మారుతున్నాయి. లోతు ఉండదని రోడ్డు దాటే ప్రయత్నం చేస్తే.. ఆ వరద ప్రవాహానికి తట్టుకోలేక కొట్టుకుపోతున్నారు. అదృష్టం కొద్దీ కొందరు ప్రాణాలతో బయట పడుతున్నారు. తాజాగా ఓ యువకుడు ఇలానే రోడ్డు దాటే ప్రయత్నం చేసి […]
షియర్ జోన్ ప్రభావంతో రాష్ట్రంలో కురుస్తున్న భారీవర్షాలకు బాటసింగారం పండ్ల మార్కెట్.. వాగులా మారింది. ఉదయం కురిసిన భారీ గాలివానలకు తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఈ పండ్ల మార్కెట్ టెంట్లు ఎగిరిపోయాయి. ఒక్కసారిగా వర్షం పండ్ల మార్కెట్‌ను ముంచెత్తడంతో.. వ్యాపారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేకపోయారు. పండ్ల దుకాణాలన్నీ తడిసిపోయాయి. వరదనీరు అంతకంతకు పెరగడంతో.. బత్తాయి, ఇతర పలు రకాల పండ్లు నీటిలో కొట్టుకుపోయాయి. వర్షం నీటిలో కొట్టుకుపోతున్న పండ్లను కాపాడుకునేందుకు వ్యాపారులు, రైతులు నానా తంటాలు పడాల్సి […]
తెలుగు రాష్ట్రాలలో మాత్రమే కాకుండా.. దేశం అంతటా వర్షాలు దంచి కొడుతున్నాయి. ఇక.. తెలంగాణలో వర్షాల కారణంగా ఎక్కడికక్కడ వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా.. మహబూబాబాద్ జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. వర్షాలకు నర్సింహులపేట మండలం కొమ్ముల వంచ కొత్త చెరువు కట్ట తెగి నీరు రోడ్డుపైకి పొంగింది. అయితే.. రోడ్డు పైనుంచి వరద పారుతుండటంతో ఆర్యభట్ట స్కూల్ బస్సు వరదల్లో చిక్కుకున్నది. డ్రైవర్ వెంటనే అప్రమత్తం అయ్యి.. జాగ్రత్త పడటంతో పెను […]