గత కొన్ని రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాలను వణికించిన వరుణుడు.. ప్రస్తుతం కర్ణాటకపై తన ప్రభావాన్ని చూపుతున్నాడు. భారీ వర్షాలతో కర్ణాటక చిగురుటాకులా వణికిపోతుంది. మరీ ముఖ్యంగా బెంగళూరును వరదలు ముంచెత్తుతున్నాయి. వీధులన్ని మునిగిపోయాయి. పలు ప్రాంతాల్లో వరదల ధాటికి వాహనాలు కొట్టుకుపోయాయి. ఇక నదులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో చాలా చోట్ల లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. ఇక భారీ వరదల కారణంగా పలు పాంత్రాల్లో గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అయ్యింది. కొన్ని ప్రాంతాల్లోసుమారు ఐదు గంటలకు పైగా ట్రాఫిక్ జామ్ అయ్యిందని.. ఉద్యోగులు ట్రాఫిక్‌లో చిక్కుకుపోవడంతో.. ఐటీ కంపెనీలకు ఏకంగా 225 కోట్ల రూపాయల మేర నష్టం వచ్చినట్లు సమాచారం.
ఈ క్రమంలో బెంగళూరులో నెలకొన్న పరిస్థితులపై నెటిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. సోషల్ మీడియాలో పోస్ట్‌లు చేయసాగారు. ఈ క్రమంలో తెలంగాణ మినిస్టర్ కేటీఆర్ బెంగళూరు వరదలపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ‘‘దేశ, రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించి ముందుండి నడిపించే మహానగరాల్లో ఇలాంటి పరిస్థితులు తలెత్తడం వల్ల ఆర్థిక అభివృద్ధిపై తీవ్ర ప్రభావం పడుతుంది. అభివృద్ధి పథంలో ప్రయాణిస్తున్న మహానగరాల్లో వేగంగా జరుగుతున్న నిర్మాణాలు, అభివృద్ధి పనులతో చాలా సమస్యలు వస్తున్నాయి. ప్రత్యేకించి ఇబ్బందులు ఎదరువుతున్న వ్యవస్థలను మెరుగుపర్చటంలో అనుకున్న ఫలితాలను సాధించలేకపోతున్నాము’’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.
అంతేకాక ‘‘మౌలిక సదుపాయాలను అభివృద్ధి పరుచుకోవడం, మెరుగ చేసుకోవటంలో కేంద్ర, రాష్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా ముందడుగు వేయాలి. ప్రస్తుతం హైదరాబాద్ సహా ఏ భారతీయ మహానగరం కూడా ప్రకృత్తి విపత్తులను, ఆకస్మిక పరిణామాలను తట్టుకోగలిగే పరిస్థితుల్లో లేదు. ఇకనైనా పాత ఆలోచనలకు స్వస్తి చెప్పి నగరప్రణాళికలు, అభివృద్ధిలో విప్లవాత్మమైన మార్పులు తీసుకురావాలి. శుభ్రమైన నీరు, స్వచ్ఛమైన గాలి, పరిశుభ్రమైన రోడ్లు, వర్షం నీటిని తరలించే ఏర్పాట్లను చేసుకోవటం అంత కష్టమైన పనేం కాదు’’ అంటూ ట్వీట్ చేశారు.
ఇదే అంశంపై కేంద్రపట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్ దీప్ సింగ్ పురిని ట్యాగ్ చేసిన కేటీఆర్.. ఓ రాష్ట్రంగా కేంద్రానికి ఈ విషయంలో మద్దతించేందుకు ఎల్లప్పుడు సిద్ధంగా ఉంటాం అని తెలిపారు. అలానే తాను పైన చెప్పిన వాటిల్లో కొన్ని అంశాలు బెంగళూరు వాసులకు నచ్చకపోవచ్చన్న కేటీఆర్.. గతంలో హైదరాబాద్ వరదల సమయంలో కొంత మంది బెంగళూరు నేతలు తమ భాగ్యనగరాన్ని విమర్శించారని గుర్తు చేశారు.
కేటీఆర్ పై నెటిజన్లు ఆగ్రహం..
అయితే కేటీఆర్ ట్వీట్లపై నెటిజనులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బెంగళూరు వరదలపై స్పందించే ముందు.. మన హైదరాబాద్ పరిస్థితి గురించి ఆలోచిస్తే బాగుంటుంది.. చిన్నపాటి వర్షానికే మునిగిపోయే హైదరాబాద్ రోడ్లను ఎందుకు బాగు చేయటం లేదంటూ నెటిజనులు కేటీఆర్‌పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోవాలని పక్కరాష్ట్రాలకు బోధిస్తున్న మంత్రి కేటీఆర్ తెలంగాణలో ప్రత్యేకించి హైదరాబాద్ లో రోడ్ల దుస్థితి గురించి ఎవరిని కలిసి ఎవరితో మాట్లాడారు.. ఏడేళ్ల నుంచి ఏం నేర్చుకుంటున్నారు.. వరదల వల్ల ఎందరు ప్రాణాలు కోల్పోతున్నారో అర్థం కావడం లేదా అంటూ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు నెటిజనులు.
To all those who are mocking the water-logged Bengaluru:
Our cities are our primary economic engines driving the States’/Country’s growth
With rapid urbanisation & sub-urbanisation, infrastructure is bound to crumble as we haven’t infused enough capital into upgrading the same
— KTR (@KTRTRS) September 5, 2022