తెలుగు రాష్ట్రాలలో మాత్రమే కాకుండా.. దేశం అంతటా వర్షాలు దంచి కొడుతున్నాయి. ఇక.. తెలంగాణలో వర్షాల కారణంగా ఎక్కడికక్కడ వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా.. మహబూబాబాద్ జిల్లాలో పెను ప్రమాదం తప్పింది.
వర్షాలకు నర్సింహులపేట మండలం కొమ్ముల వంచ కొత్త చెరువు కట్ట తెగి నీరు రోడ్డుపైకి పొంగింది. అయితే.. రోడ్డు పైనుంచి వరద పారుతుండటంతో ఆర్యభట్ట స్కూల్ బస్సు వరదల్లో చిక్కుకున్నది. డ్రైవర్ వెంటనే అప్రమత్తం అయ్యి.. జాగ్రత్త పడటంతో పెను ప్రమాదం తప్పింది. స్థానికులు వెంటనే ఘటనా స్తలానికి చేరుకుని బస్సులో ఉన్న 16 విద్యార్థులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ తో సహా, విద్యార్థులు అంతా క్షేమంగా బయట పడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఇది కూడా చదవండి: వరద ముంపు నుండి 1200 మందిని రక్షించిన రియల్ హీరో!