తెలంగాణలో పది రోజుల నుంచి వర్షాలు పడుతూనే ఉన్నాయి. హైదరాబాద్ లో ముసురుతో కూడిన వర్షం పడటంతో పలు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఏప్రిల్, మే నెలలో ఎండలు దంచికొడతాయి.. కానీ ఈ మద్య వాతావరణంలో విచిత్రమైన మార్పులు సంభవించి అకాల వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో పంటలు నెలమట్టమైన రైతులు లబోదిబో అంటున్నారు.
తెలంగాణలో వైఎస్ షర్మిల వైఎస్సార్‌టీపీ స్థాపించి.. అధికార ప్రభుత్వంపై ప్రజల పక్షాణ పోరాడుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో పలు ప్రాంతాలు పర్యటించి ప్రజల కష్టాలు అడిగి తెలుసుకుంటున్నారు.
భారీ వర్షాల కారణంగా వరద ఉదృతి ఎంత దారుణంగా ఉందో గత కొన్ని రోజులుగా మనం చూస్తూనే ఉన్నాం. నదీ జలాలు, చెరువులు నిండిపోవడంతో ఎటూ దారి లేక ఆ వరద నీరంతా రోడ్లపైకి వస్తుంది. దీంతో రోడ్లన్నీ జలాశయాలుగా మారుతున్నాయి. లోతు ఉండదని రోడ్డు దాటే ప్రయత్నం చేస్తే.. ఆ వరద ప్రవాహానికి తట్టుకోలేక కొట్టుకుపోతున్నారు. అదృష్టం కొద్దీ కొందరు ప్రాణాలతో బయట పడుతున్నారు. తాజాగా ఓ యువకుడు ఇలానే రోడ్డు దాటే ప్రయత్నం చేసి […]
షియర్ జోన్ ప్రభావంతో రాష్ట్రంలో కురుస్తున్న భారీవర్షాలకు బాటసింగారం పండ్ల మార్కెట్.. వాగులా మారింది. ఉదయం కురిసిన భారీ గాలివానలకు తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఈ పండ్ల మార్కెట్ టెంట్లు ఎగిరిపోయాయి. ఒక్కసారిగా వర్షం పండ్ల మార్కెట్‌ను ముంచెత్తడంతో.. వ్యాపారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేకపోయారు. పండ్ల దుకాణాలన్నీ తడిసిపోయాయి. వరదనీరు అంతకంతకు పెరగడంతో.. బత్తాయి, ఇతర పలు రకాల పండ్లు నీటిలో కొట్టుకుపోయాయి. వర్షం నీటిలో కొట్టుకుపోతున్న పండ్లను కాపాడుకునేందుకు వ్యాపారులు, రైతులు నానా తంటాలు పడాల్సి […]
తెలుగు రాష్ట్రాలలో మాత్రమే కాకుండా.. దేశం అంతటా వర్షాలు దంచి కొడుతున్నాయి. ఇక.. తెలంగాణలో వర్షాల కారణంగా ఎక్కడికక్కడ వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా.. మహబూబాబాద్ జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. వర్షాలకు నర్సింహులపేట మండలం కొమ్ముల వంచ కొత్త చెరువు కట్ట తెగి నీరు రోడ్డుపైకి పొంగింది. అయితే.. రోడ్డు పైనుంచి వరద పారుతుండటంతో ఆర్యభట్ట స్కూల్ బస్సు వరదల్లో చిక్కుకున్నది. డ్రైవర్ వెంటనే అప్రమత్తం అయ్యి.. జాగ్రత్త పడటంతో పెను […]
తెలంగాణలో భారీ వర్షాలు పడుతున్నాయి. గత మూడు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తుండడంతో వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగిపోయాయి. ఏదైనా ముఖ్యమైన అత్యవసర పనులు ఉంటేనే బయటకు రావాలని అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షాల కారణంగా సీఎం కేసీఆర్ […]