తెలంగాణలో వైఎస్ షర్మిల వైఎస్సార్‌టీపీ స్థాపించి.. అధికార ప్రభుత్వంపై ప్రజల పక్షాణ పోరాడుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో పలు ప్రాంతాలు పర్యటించి ప్రజల కష్టాలు అడిగి తెలుసుకుంటున్నారు.
తెలంగాణలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు వైఎస్ షర్మిల వైఎస్సార్‌టీపీ స్థాపించి ప్రజల పక్షాణ పోరాడుతున్న విషయం తెలిసిందే. అధికార పార్టీకి వ్యతిరేకంగా ప్రశ్నిస్తూ.. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఖమ్మం పర్యటనలో వైఎస్ షర్మిల పర్యటన కొనసాగుతున్న సమయంలో హఠాత్తుగా అస్వస్థతకు గురై సొమ్మసిల్లి కిందపడిపోయింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఈరోజు వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఖమ్మం జిల్లాలోని ఇటీవల వర్షాలకు జరిగిన పంట నష్టాన్ని పరిశీలించడానికి వెళ్లారు. పంట నష్టంపై మాట్లాడుతుండగా అకస్మాత్తుగా కళ్లు తిరిగి పడిపోయారు. గత వారం రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వడగండ్ల వానలు కురిసిన విషయం తెలిసిందే. అకాల వర్షంతో పంట నష్టపోయిన రైతులను కలిసేందుకు వైఎస్ షర్మిల నేడు ఖమ్మం జిల్లా పర్యటిస్తున్నారు.
ఈ క్రమంలో కొణిజర్ల మండలంలోని తనికెళ్ళ గ్రామంతో పాటు ఇతర ప్రాంతాల్లో పంట నష్టాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా పంట నష్టం గురించి రైతులతో మాట్లాడుతుండగా హఠాత్తుగా ఆమె కళ్లుతిరిగి పడిపోయారు. వెంటనే సిబ్బంది సపర్యలు చేశారు. గత కొన్నిరోజులుగా వరుసగా ఎండలో తిరగడం వల్ల ఆమె అస్వస్థతకు గురై ఇలా పడిపోయి ఉంటారని వైఎస్సార్‌టీపీ అంటున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని నేతలు అంటున్నారు.