తెలంగాణలో పది రోజుల నుంచి వర్షాలు పడుతూనే ఉన్నాయి. హైదరాబాద్ లో ముసురుతో కూడిన వర్షం పడటంతో పలు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
గత పది రోజుల నుంచి భారీ వర్షాలతో తెలంగాణ తడిసి ముద్దవుతుంది. హైదరాబాద్ నగరాన్ని ముసురు అస్సలు వీడటం లేదు. నగరంలో ఉదయం కాస్త ఎండ అనిపించినా.. సాయంత్రానికి భారీ వర్షం కురిసింది. రెండు గంటల పాటు నాన్ స్టాప్ గా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడటంతో.. పలు కాలనీలు పూర్తిగా జలమయం అయ్యాయి. భారీ వర్షం పడటంతో నగరంలో ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు వాహనదారులు. పలు చోట్ల డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. రాబోయే ఐదు రోజుల పాటు భారీ వర్షాలు ఉండబోతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి జీహెచ్ఎంసీ అధికారులను అప్రమత్తం చేయడంతో రంగంలోకి దిగారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు హెచ్చరించారు. వివరాల్లోకి వెళితే..
గత కొన్నిరోజలుగా హైదరాబాద్ లో ముసురుతో కూడుకున్న వర్షం పడుతూనే ఉంది. సోమవారం సాయంత్రం నుంచి నాన్ స్టాప్ గా జంట నగరాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. భారీ వర్షం కారణంగా ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ట్రాఫిక్ జామ్ తో కిలో మీటర్ల మేర అంతరాయం ఏర్పడింది. బంజారాహిల్స్, ఫిల్మ్‌నగర్, జూబ్లీహిల్స్,అమీర్‌పేట్, వెంకటగిరి, గచ్చిబౌలి, యూసఫ్‌గూడ, హైటెక్ సిటీ, కుత్బుల్లాపూర్, సుచిత్ర, కొంపల్లి, గాజులరామారం, కొంపల్లి, చింతల్, నార్సింగి, కోకాపేట్, సురారం, బోయిన్‌పల్లి, అల్వాల్, తిరుమలగిరి, జవహర్‌నగర్, బేగంపేట్,తార్నాక, లాలాపేట్, బొల్లారం, మారేడుపల్లి, చిలకలగూడ, హబ్సిగూడ, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, పటాన్‌చెరు, నిజాంపేట, లింగంపల్లి, నేరెడ్‌మెట్ తదితర ప్రాంతాల్లో ఊదురు కాలులతో కూడిన వర్షం పడుతుంది.
భారీ వర్షం కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు చోట్ల ట్రాఫిక్ జామ్ అవుతున్న కారణంగా ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. రాగల మూడు గంటల పాటు వర్షం కంటిన్యూగా పడుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆఫీస్ నుంచి ఇళ్లకు వెళ్ల సమయం కావడంతో ట్రాఫిక్ జామ్ కారణంగా ప్రజలు నరకం చూస్తున్నారు. జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమై రంగంలోకి దిగి సహాయక కార్యక్రమాలు చేపట్టారు. ప్రజలు బయటకు రావొద్దని.. అనవసరపు ప్రయాణాలు చేయొద్దని డీఆర్ఎఫ్ హెర్చరించింది. సహాయక చర్యల కోసం 040-21111111, 9000113667 నంబర్లను సంప్రదించాలని అధికారులు పేర్కొన్నారు.
#24JULY 5:40PM⚠️
Half of the City under SEVERE RAIN ALERT!
will cover South #Hyderabad too in next 30mins⚠️#HyderabadRains pic.twitter.com/d1hmSppnqR
— Hyderabad Rains (@Hyderabadrains) July 24, 2023