హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షం ముంచెత్తింది.నగరంలోని పలు ఏరియాల్లో భారీ వర్షం ఏకధాటిగా కురుస్తుంది.
నిన్నటి వరకూ భగభగ మండే ఎండలతో ప్రతాపం చూపించిన వాతావరణం ఒక్కసారిగా కూలెక్కింది. ఇటీవల హైదరాబాద్ ని పలకరించి ముంచెత్తిన వర్షం మరోసారి నగరాన్ని ముంచెత్తింది. ఈరోజు ఉదయం నుంచి వర్షం విజృంభిస్తోంది. భారీ ఈదురుగాలులతో మొదలైన వర్షం గంటకు పైగా ఆగకుండా కురుస్తూనే ఉంది. ఉదయం 6 గంటలకు మొదలైన వర్షం ఏకధాటిగా గట్టిగానే కురుస్తోంది. భారీ వర్షం కారణంగా రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలయమయ్యాయి. కూకట్ పల్లి, అమీర్ పేట్, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్, మణికొండ సహా పలు ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తోంది.
హైదరాబాద్ నగరంతో పాటు నగర శివారు జిల్లాల్లో కూడా వర్ష ప్రభావం కనిపిస్తోంది. మరోవైపు వడగండ్ల వాన పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరో పాటు భారీ వర్షాలు, వడగండ్ల వాన ఉంటాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం జంట నగరాల్లో అల విధ్వంసం మొదలైంది. వడగండ్ల (రాళ్ళ) వాన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
#Early this morning, it raining in #HyderabadRains. pic.twitter.com/8KwJ5O1meN
— innocent Banda (@Baag786) April 29, 2023
Ala vidhwamsam modalu #HyderabadRains , just miss 😄 pic.twitter.com/Y7DMLOZTqQ
— Sunny (@Dr_S_Chanamolu) April 29, 2023