షియర్ జోన్ ప్రభావంతో రాష్ట్రంలో కురుస్తున్న భారీవర్షాలకు బాటసింగారం పండ్ల మార్కెట్.. వాగులా మారింది. ఉదయం కురిసిన భారీ గాలివానలకు తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఈ పండ్ల మార్కెట్ టెంట్లు ఎగిరిపోయాయి. ఒక్కసారిగా వర్షం పండ్ల మార్కెట్‌ను ముంచెత్తడంతో.. వ్యాపారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేకపోయారు. పండ్ల దుకాణాలన్నీ తడిసిపోయాయి. వరదనీరు అంతకంతకు పెరగడంతో.. బత్తాయి, ఇతర పలు రకాల పండ్లు నీటిలో కొట్టుకుపోయాయి.
వర్షం నీటిలో కొట్టుకుపోతున్న పండ్లను కాపాడుకునేందుకు వ్యాపారులు, రైతులు నానా తంటాలు పడాల్సి వచ్చింది. కొత్తపేట గడ్డి అన్నారం మార్కెట్‌ను తాత్కాలిక ప్రాతిపదికన బాటసింగారం హెచ్‌ఎండీఏ లాజిస్టిక్స్ పార్కులోకి తరలించిన విషయం తెలిసిందే. ఏర్పాటు అయితే చేశారు కానీ, ఇక్కడ ఎలాంటి సౌకర్యాలు లేవని.. వ్యాపారులు, రైతులు వాపోతున్నారు.
Hardships of traders at Batasingaram Fruit Market#HyderabadRains pic.twitter.com/hhy7oo99dA
— Md Nizamuddin (@NizamJourno) July 22, 2022
The heavy #flood_water washed away all the #fruits in #batasingaram fruit market after heavy rain lashes out in #Hyderabad.#HyderabadRains #Telanganarains pic.twitter.com/FSb3OQqIij
— Arbaaz The Great (@ArbaazTheGreat1) July 22, 2022
ఇది కూడా చదవండి: MLA Seethakka: వీడియో: సీతక్కపై దివ్యాంగురాలి అభిమానం.. భావోద్వేగానికి గురైన సీతక్క!
ఇది కూడా చదవండి: KCR New Convoy: సీఎం కేసీఆర్ వాహన శ్రేణికి కొత్త ఫిట్టింగ్స్.. అదీ గుట్టుచప్పుడు కాకుండా!