రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. చాలా మంది రాజకీయ నేతలతో పోలిస్తే.. ఆమె వ్యక్తిత్వం ఎంతో విభిన్నమైనది. ప్రజలకు ఆపద వచ్చిందని తెలిస్తే.. ఎంత దూరమైనా వెళ్తుంది. తాను ఎమ్మెల్యేని అనే అహాంకారం ఆమెలో లేశమాత్రమైన ఉండదు. తాను ప్రజా సేవకురాలినని భావిస్తుంది. ఇక కరోనా సమయంలో ప్రజల పట్ల ఆమె చూపిన చొరవను ఎందరో ప్రశంసించారు. అసలు సిసలు నాయకురాలు అంటూ మెచ్చుకున్నారు. కరోనా కాలంలో సీతక్క.. ఏజెన్సీ ప్రాంతాల్లో.. సరైన రోడ్డు మార్గాలు లేని ప్రాంతాలకు కాలి నడకన వెళ్లి.. వారికి కావాల్సిన నిత్యవసరాలు అందించి.. ప్రజలపై తనకున్న అభిమానాన్ని, బాధ్యతని చాటుకుంది. ఆమె చేసిన పనిపై జనాలు పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపించారు.
ఇక తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలతో జనాలు ఎంత ఇబ్బంది పడ్డారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ క్రమంలో సీతక్క వానలోనే తడుస్తూ.. బాధితుల దగ్గరరు వెళ్లి.. వారి సమస్యలు తీర్చే ప్రయత్నం చేస్తూ.. నేనున్నాను అంటూ భరోసా ఇస్తుంది. ఇంతలా ప్రజలని అక్కున చేర్చుకుంటుంది కనుక ఆమెకు అభిమానులు రోజు రోజుకు పెరిగిపోతున్నారు. ఈ క్రమంలో ఓ అభిమాని చేసిన పని చూసి సీతక్క తీవ్ర భావోద్వేగానికి గురయ్యింది. ఆ వివరాలు..
ఏపీలో కూడా సీతక్కకు అభిమానులున్నారు. ఈ క్రమంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన స్వప్నిక అనే దివ్యాంగురాలు చేతులు లేకున్నా.. నోటితో సీతక్క బొమ్మ గీసి ఆమెపై అతనకున్న అభిమానాన్ని చాటుకుంది. విద్యుత్ ప్రమాదంలో రెండు చేతులు కోల్పోయిన స్వప్నిక నోటితోనే సీతక్క బొమ్మ గీసింది. ఇది చూసిన సీతక్క తీవ్ర భావోద్వేగానికి గురయ్యింది. రాజకీయాల్లో కొందరు స్వార్థపరుల మాటలు చూస్తే.. ఈ రంగం వదిలి వెళ్లి పోవాలి అనిపిస్తుంది. అలాంటి సమయంలో ఇలాంటి అభిమానులే తనకు మద్దతుగా, తోడుగా ఉన్నారని సీతక్క చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరలవుతోంది. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
నేటి రాజకీయం లో ఆణిముత్యం.. జనం కోసమే అనునిత్యం. నీ ఆరాటం.. నీ పోరాటం మాకు స్ఫూర్తి అక్క @seethakkaMLA#సీతక్కకు #జన్మదినశుభాకాంక్షలు 💐🎉🙏#happybirthdayseetakkaHappyBirthday . me birthday special art madam garu.
me strong girl swapnika mouth artist .@SonusoodBhanu pic.twitter.com/yvl5IBFMc9
— @mouth Artist Swapnika (@PawanSister) July 9, 2022