ఇటీవల కాలంలో ప్రేమకు హద్దు లేనట్లే.. పెళ్లికి కూడా లింగ బేధం లేకుండా పోయింది. ఆడవాళ్లను ఆడవాళ్లు పెళ్లి చేసుకోవడం, ఇద్దరు మగవాళ్లు ప్రేమలో పడి పెద్దల సమక్షంలో పెళ్లిళ్లు చేసుకోవడం ఇటీవల కాలంలో చూశాం.
సాధించాలనే పట్టుదల దానికి తగిన కృషి చేస్తే ఎంతటి లక్ష్యాన్ని అయినా చేధించవచ్చని నిరూపిస్తున్నారు పేదింటి బిడ్డలు. అకుంఠిత దీక్షతో రాత్రి పగలు చదివి కన్నోల్ల కలల్ని వారి కష్టాన్ని వమ్ము చేయకుండా వారి ఆశయాలను సాధిస్తున్నారు.
సర్వేంద్రియానాం నయనం ప్రధానం అని పెద్దలు అన్నారు . మానవ జీవితంలో కన్నుకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. కంటి చూపుతోనే ప్రతి పనిని చేసుకుంటున్నాము. కంటి చూపు లేకపోతే జీవితం ఎంత భయంకరంగా ఉంటుందో ఊహించుకుంటేనే వెన్నులో వణుకు పుడుతుంది. కంట్లో చిన్న నలుసు పడినా కూడా తట్టుకోలేము. అలాంటిది ఓ బాలిక కంట్లో నుంచి పేపర్ ముక్కలు, ఇనుప ముక్కలు వంటివి రావడం సంచలనంగా మారింది.
ప్రతి ఏటా సూర్యుడు తన ప్రతాపం పెంచుకుంటూ పొతున్నాడే కానీ.. ఏమాత్రం తగ్గడం లేదు. అలానే ఈ ఏడాది కూడా భానుడు భగభగ మంటున్నాడు. పిల్లలు, వృద్ధులు ఈ సూర్యతాపానికి అల్లాడిపోతున్నారు. ముఖ్యంగా మిరప, పత్తి తదితర పంటల్లో పనులు చేసే వారు ఆరుబయటే ఉండాలి. వారి సమస్యను పరిష్కరించేందుకు షణ్ముగ రావు అనే వ్యక్తి ఓ నూతన ఆవిష్కరణ చేశారు.
ఐదు నెలల క్రితమే వారికి పెళ్లయ్యింది. భవిష్యత్తు గురించి ఎన్నో అందమైన కలలు కన్నారు. కెరీర్, పిల్లలు, ఇలా నూరేళ్ల జీవితానికి సంబంధించిన ప్రణాళికలు సిద్ధిం చేసుకున్నారు. కానీ వారి ఆశలు అడియాసలు అయ్యాయి. కలలన్ని కల్లలయ్యాయి. ఆ వివరాలు..
శరీరంలో అన్ని అవయవాలు సరిగ్గా ఉన్నవారు.. తమకు ఇంకేదో తక్కువైందని దేవుడిని నిందిస్తుంటారు. అలానే చిన్న పరాజయం పొందగానే తీవ్ర నిరాశకు గురవుతుంటారు. ఇంకా దారుణం ఏమిటంటే తాము జీవితంలో ఏమి సాధించలేకపోయమని మానసిక వేదనకు గురై... ఆత్మహత్యలు సైతం చేసుకుంటున్నారు. కానీ కొందరు వైకల్యం తమను పీడిస్తున్నా.. మొక్కవోని ధైర్యంతో ముందుకుసాగుతూ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తుంటారు. ఆ కోవాకు చెందిన వ్యక్తే తెలంగాణకు చెందిన భాగ్య. వైకల్యం విసిరిన సవాళ్లకి ఎదురీది. విజేతగా నిలిచింది.
ఇంటి వరండాలోని ఊయలలో నిద్రపోతున్న చిన్నారి దగ్గరకు కోతులు వచ్చాయి. వాటికి ఏమనిపించిందో ఏమో.. చిన్నారి మీద దాడి చేశాయి. చిన్నారి కాలి బొటన వేలును కొరికేశాయి. చిన్నారి అరుపులు విన్న తల్లి అక్కడికి రావటంతో..
వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైస్ షర్మిలను మహబూబాబాద్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె చేస్తున్న పాదయాత్రకు మహబూబాబాద్‌లో అనుమతిని రద్దు చేశారు. ప్రస్తుతం అక్కడ హైటెన్షన్ నెలకొని ఉంది.
వివాహ సమయంలో వేదమంత్రాల సాక్షిగా అన్ని వేళలా తోడునీడగా ఒకరికి ఒకరు ఉంటామని నవ దంపతులు ప్రమాణాలు చేస్తుంటారు. అలా పెళ్లి నాడు చేసిన ప్రమాణాలు ఓ వృద్ధ దంపతుల విషయంలో నిజమయ్యాయి. సుమారు అరవై ఏళ్ల వారి సంసారాన్ని ఎంతో అన్యోన్యంగా గడిపారు. కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా నిలిచారు. తమను ఎవ్వరు విడదీయకూడనదే ధృడ నిశ్చయంగా ఉన్నారు. అందుకేనేమో ఆ దంపతులు గంటల వ్యవధిలోనే లోకాన్ని వదిలారు. భార్య చనిపోయిన కొన్ని గంటల్లోనే భర్త మరణించారు. […]
ప్రతి ఇంట్లో అత్తాకోడళ్ల మధ్య ఘర్షణలు అనేది సర్వసాధారణం. చాలా అరుదుగా మాత్రమే గొడవపడని అత్తాకోడళ్లు మనకు కనిపిస్తుంటారు. ఇక భార్యను, తల్లిని ఇద్దర్ని బ్యాలెన్స్ చేయడానికి మగవాళ్లు నానా తంటాలు పడుతుంటారు. అమ్మవైపు మాట్లాడితే భార్యకు కోపం, భార్యవైపు మాట్లాడితే అమ్మకి కోపం. ఇలా ఇద్దరికి సర్థి చెప్పలేక మగవాళ్లు తలలు పట్టుకుంటారు. అయితే కొందరు మాత్రం భార్య మాటలే వింటూ తల్లిని అనేక రకాల ఇబ్బందులకు గురిచేస్తుంటారు. ఈక్రమంలో పొరపాటున భార్య ఏడిస్తే చాలు […]