ప్రస్తుతం అనంతపురంలో ఎక్కడ చూసినా భారీ వర్షాల కారణంగా ఇళ్ళు, వాకిళ్ళూ, రోడ్లు నీట మునుగుతున్నాయి. మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న చాలా కాలనీలు నీట మునిగాయి. యాలేరు, ఆలమూరు చెరువుల నుంచి వచ్చిన వరద నీరు కారణంగా అనంతపురం నగరం మొత్తం నీట మునిగింది. చాలా ప్రదేశాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే అధికారులు అప్రమత్తం అయ్యారు. వరద నీటిలో చిక్కుకున్న ప్రజలను పోలీసులు రక్షణ చర్యలు చేపట్టి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ట్రాక్టర్ల సహాయంతో వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.
#WATCH | Fire department personnel engaged in the rescue of people after heavy rains leave homes and streets flooded in Andhra Pradesh’s Anantapur pic.twitter.com/HtGjBx81ar
— ANI (@ANI) October 13, 2022
కాగా అనంతపురంలో కురిసిన భారీ వర్షాలు, అక్కడి పరిస్థితులపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. అనంతపురంలో ఉన్న పరిస్థితులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అధికారులు సీఎం జగన్ కు మొత్తం పరిస్థితిని వివరించారు. ఇప్పటికే సహాయక చర్యలు చేపట్టామని, వరద ప్రభావిత ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు తెలిపారు. దీంతో సీఎం జగన్ అధికారులకు పలు సూచనలు చేశారు. వరద బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని, వర్షాలు, వరదల కారణంగా నిర్వాసితులైన వారికి ఆర్థిక సాయం చేయాలని అధికారులకు ఆదేశించారు. వరద బాధిత కుటుంబాలకు రూ. 2 వేల చొప్పున తక్షణ సహాయం అందజేయాలని ఆదేశించారు.
Water levels rise in Anantapur district after heavy rains; over 200 families are stranded in Shanthi nagar.
More details in this #ReporterDiary
(@Jay_Apoorva18) pic.twitter.com/ol04ik5WrX— IndiaToday (@IndiaToday) October 13, 2022
అలానే నిత్యావసర సరుకులైన బియ్యం, పామాయిల్ నూనె, కందిపప్పు, బంగాళదుంపలు, ఉల్లిపాయలు.. ప్రతీ బాధిత కుటుంబానికి ఖచ్చితంగా చేరవేయాలని జగన్ ఆదేశించారు. ఇక వర్షాలు, వరదల కారణంగా జరిగిన ఆస్తి నష్టం, పంట నష్టంపై కూడా సీఎం జగన్ అధికారులకు కీలక సూచనలు చేశారు. వర్షాలు తగ్గుముఖం పట్టిన వెంటనే బాధితులకు జరిగిన నష్టాన్ని అంచనా వేసి తక్షణమే పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
అనంతపురం వర్షాలపై సీఎం జగన్ సమీక్ష…బాధిత కుటుంబాలకు రూ.2వేలుhttps://t.co/KblqF82DsS#Anantapur #APlatestnews #CMYSJagan #journalistsai #heavyrains #Unstoppable2WithNBK pic.twitter.com/j60FjWiRE2
— Journalist Sai (@saisatya14) October 13, 2022