ఉత్తరప్రదేశ్‌లో ఓ మహిళ తన జీవనోపాధి కోసం ఆటో నడుపుతుంది. తన బిడ్డను ఒడిలో పెట్టుకుని ప్యాసెంజర్స్ ని ఆటోలో ఎక్కించుకుంటుంది. మధ్యలో తన బిడ్డకు పాలుపడుతూ.. ఆటో స్టీరింగ్ ను పట్టుకుని ప్రయాణికులను వారిని గమ్యస్థానాలకు చేరుస్తుంది
మన జీవితానికి మొదటి గురువు అమ్మ. అమ్మ ప్రేమ వెలకట్టలేనిది. సృష్టిలో ప్రతి జీవి తన పిల్లల కోసం పరితపిస్తుంటుంది. తల్లి స్థానంలో ఉన్న ఏ జీవి అయినా తన బిడ్డల కోసం ఎంత కష్టమైనా ఇష్టంగా చేస్తుంది. పిల్లలను తన పొత్తిల్లోనే పెట్టుకుని ఆలనాపాలనా చూసేంది తల్లి మాత్రమే. ఎన్ని జన్మలెత్తినా తల్లి ప్రేమకు వెలకట్టలేము. తాను తిన్నా తినకున్నా.. పిల్లలకు కడుపు నింపే ప్రయత్నంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా అధిగమిస్తుంది. అందుకే తల్లిని దైవంగా భావిస్తారు. రోజు మూడు పూటలా కడుపు నిండాలంటే మూడు చక్రాలు తిరగాల్సిందే. ఇక్కడ తన బిడ్డను ఒళ్లో పెట్టుకుని బతుకు బండిని నడుపుతూ పెద్ద సాహసం చేస్తోంది. ఈమె కష్టపడుతున్న తీరును చూసి కొందరు వీడియో తీసి ‘కాప్షన్ అవసరం లేదు.. తల్లీ!’ అంటూ క్యాప్షన్ పెట్టి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అలాంటి ఓ తల్లి గురించి తెలుసుకుందాం..
ఉత్తరప్రదేశ్‌లో ఓ మహిళ తన జీవనోపాధి కోసం ఆటో నడుపుతుంది. తన బిడ్డను ఒడిలో పెట్టుకుని ప్యాసెంజర్స్ ని ఆటోలో ఎక్కించుకుంటుంది. మధ్యలో తన బిడ్డకు పాలుపడుతూ.. ఆటో స్టీరింగ్ ను పట్టుకుని ప్రయాణికులను వారిని గమ్యస్థానాలకు చేరుస్తుంది. ఈ క్రమంలో ఆ తల్లి పడుతున్న ఆరాటానికి నెటిజన్లు హాట్సాఫ్ చెబుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నట్టింట వైరల్ అవుతుంది. దీనిపై నెటిజన్లు తమకు తోచిన విధంగా కామెంట్స్ పెడుతున్నారు. ఇన్‌స్టా గ్రామ్‌లో వైరల్ అవుతున్న ఈ వీడియోను లక్షలాది మంది చూసి ఫిదా అయిపోయారు. మరికొందరు భద్రతపై ఆందోళన చెందుతున్నారు. తన బిడ్డను, ప్రయాణికుల ప్రాణాలను కూడా ఫణంగా పెడుతుందని కొందరు కామెంట్లు పెట్టారు.
ఇలా నెటిజన్లు భావోద్వేగానికి లోనై చాలా కామెంట్లు పెట్టారు. ఈ వీడియోని తల్లిని చూస్తుంటే రోడ్డుపై ఆటో రిక్షానే కాదు.. బతుకు బండిని లాగే బాధ్యత కూడా ఆ తల్లిపైనే ఉందని తెలుస్తుంది. ఇలాంటి తల్లులు మన కంటబడకుండా చాలామంది ఉన్నారు. వారి కష్టాన్ని గుర్తించి వారి పిల్లలు పెద్దయ్యాక తల్లిని ఆదరించాలని కోరుకుందాం. దీనిపై మీ కామెంట్స్ తెలియజేయండి.