ఆనంద్ మహీంద్రా.. ఈ పేరు గురించి ప్రత్యేకమైన పరిచయం అక్కరలేదు. సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటారు మహీంద్రా సంస్థల అధినేత ఆనంద్ మహీంద్రా. పలు ఆసక్తికర విషయాలని వెతికి పట్టుకొని మరీ ట్విట్టర్ లో షేర్ చేసి వాటికి తనదైన శైలిలో కామెంట్లు చేస్తాడు. అంతేకాదు కష్టాల్లో ఉన్నవారికి తన సంస్థలో ఉద్యోగావకాశాలు కల్పించడం.. పేదరికంలో ఉన్నవారిని ఆదుకోవడం లాంటి చేస్తుంటారు ఆనంద్ మహీంద్రా. ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు తనదైన స్టైల్లో జవాబు ఇచ్చారు. దీనికి సంబంధించిన ట్విట్ వైరల్ అవుతుంది.
సోషల్ మాద్యమాల్లో అప్పుడప్పుడు ఆనంద్ మహేంద్ర నెటిజన్ల ప్రశ్నలకు వెరైటీగా సమాధానం చెబుతుంటారు. ఈ క్రమంలో ఓ నెటిజన్ ‘సార్… మీ క్వాలిఫికేషన్ ఏంటో నేను తెలుసుకోవచ్చా’ అని కామెంట్ చేశాడు. దీనికి మహీంద్రా స్పందిస్తూ…. ‘స్పష్టంగా చెప్పాలంటే.. నా వయసుకి నా అనుభవమే నా అర్హత’ అని సమాధానమిచ్చారు. దీంతో ఆ నెటిజన్ సైలెంట్ అయ్యాడు. మొత్తినికి ఆనంద్ మహేంద్ర చమత్కారంతో కూడాన సమాధనాలు పలువురిని ఆకర్షిస్తుంటాయి. ఆయన ఇచ్చిన సమాధానంపై పలువురు నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు.
ఈ పోస్ట్ కి 2,280 లైకులు.. 118 రీ ట్విట్స్ వచ్చాయి. గతంలో కూడా ఒక నెటిజన్ ఆనంద్ మహీంద్రా వయస్సు అడిగినప్పుడు కూడా అలాంటిదే జరిగింది. ఓ నెటిజన్ ఆనంద్ జీ.. మీ వయసు ఎంత? అని ప్రశ్నించాడు. ‘అంకుల్ మీకు గూగుల్ సమాధానంపై మీకు అస్మలు నమ్మకం లేదా? ’ అంటూ ఆనంద్ మహీంద్రా తన వయస్సును అడిగిన వ్యక్తికి బదులిచ్చారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Frankly, at my age, the only qualification of any merit is experience… https://t.co/azCKBgEacF
— anand mahindra (@anandmahindra) June 27, 2022
What? You don’t trust Uncle Google to give you the answer?? 😊 https://t.co/DGlmuTldlA
— anand mahindra (@anandmahindra) June 5, 2022