భారత దేశంలో ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా గురించి తెలియాని వారు ఉండరు. వ్యాపార రంగంలో ఎంత బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉంటూ.. ఎన్నో నవ్వులు పూయించేవి, ఎంతోమందికి స్ఫూర్తినిచ్చే ఫోటోలు, వీడియోలు తన ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తుంటారు.
మన చుట్టూ ఉన్న పరిసరాలు శుభ్రంగా ఉంటే.. ఎలాంటి అంటువ్యాధులు ప్రబలకుండా ఉంటుంది. మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. కరోనా వైరస్ లాంటి ప్రమాదకర రోగాలను దూరంగా ఉంచాలంటే విధిగా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. మహాత్మాగాంధీ కలలు కన్న పరిశుభ్ర భారతావనిని సాధించడమే లక్ష్యంగా దేశ వ్యాప్తంగా ‘స్వచ్ఛ భారత్’ కార్యక్రమాన్ని గాంధీ జయంతి 2014 లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఇక ప్రముఖ పారిశ్రామివేత్త ఆనంద్ మహీంద్రా గురించి తెలియని వారు ఉండరు. వ్యాపార రంగంలో ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా.. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉంటారు. ఎప్పుడూ ఫన్నీ వీడియోలు, స్ఫూర్తినిచ్చే వీడియోలు తన ట్విట్టర్ లో పోస్ట్ చేస్తుంటారు. తాజాగా మహిళ వీడియోనుపారిశ్రామికదిగ్గజం ఆనంద్ మహీంద్రా రీట్వీట్ చేశారు. వివరాల్లోకి వెళితే..
దేశంలో స్వచ్ఛ భారత్ మొదలైనప్పటి నుంచి చాలామందిలో ఎంతో మార్పు వచ్చింది. కొంతమంది స్వచ్ఛందంగా తమ పనులు పక్కబెట్టి రోడ్డు పై చెత్తా చెదారం కనిపిస్తే వాటిని తీసుకు వెళ్లి డస్ట్ బిన్ లో పడవేస్తున్నారు. తాజాగా కర్ణాటకలోని బస్టాండ్ లో ఓ మహిళకు సంబంధించిన వీడియోను ఆనంద్ మహేంద్ర రీ ట్వీట్ చేశారు. అంకోలా బస్టాండ్ లో పండ్లు అమ్ముకుంటున్న ఓ మహిళ తన కస్టమర్లు తిని విసిరివేసిన ఆకులను ఒక్కొక్కటీ ఏరి డస్ట్ బిన్ లో పడవేస్తుంది. ఈ వీడియోని మొదట ఆదర్శ్ హెగ్డే అనే వ్యక్తి ట్విట్టర్ లో షేర్ చేశాడు. బస్టాండ్ లో పండ్లు అమ్ముకుంటూ ఓ మహిళ జనం విసిరివేసిన ఆకులను ఎంతో ఓపికగా పట్టుకొని నడుచుకుంటే వెళ్లి డస్ట్ బిన్ లో వేయడం చూసి ఆనంద్ మహీంద్ర ముగ్దులయ్యారు.
ఈ వీడియో పై తనదైన శైలిలో రిప్లై ఇచ్చారు ఆనంద్ మహీంద్రా. ‘దేశానికి స్వచ్ఛ భారత్ గా తీర్చిదిద్డంలో వీరై అసలైన హీరోలు, ఆమె చేస్తున్న పని కనిపించకుండా పోకూడదు.. ఆ మహిళ అందరూ ప్రశసించాలి.. ఆదర్శంగా తీసుకోవాలి’ అంటూ ట్విటర్ లో రాసుకొచ్చారు. అంతేకాదు బస్టాండ్ లో ఉన్న ఆ మహిళ వివరాలు కావాలి అంటూ ఆదర్శ హెగ్డే ట్విట్ కి రీ ట్వీట్ చేశారు ఆనంద్ మహీంద్రా. ఇక ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేసిన తర్వాత వరుసగా నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. సమాజంలో పేద, బలహీన వర్గాలకు చెందిన వారికి సమాజ సేవ చేయాలన్న తపన, బాధ్యత ఎక్కువగా ఉంటుందని ఓ యూజర్ కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
These are the real, quiet heroes making Bharat Swachh. I really would like her to know that her efforts have not gone unnoticed & are appreciated. How do you suggest we can do that? @adarshahgd can you find someone who lives in that area & can contact her? https://t.co/2SzlTE9LZy
— anand mahindra (@anandmahindra) April 11, 2023