భారత ఆటోమొబైల్ రంగంలో మహీంద్రా కంపెనీకి ఎంతో గొప్ప పేరుంది. ఆనంద్ మహీంద్రాకు వ్యాపారవేత్తగానే కాకుండా వ్యక్తిత్వం పరంగానూ ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఆనంద్ మహీంద్రా ఎప్పుడూ ట్విట్టర్ లో ఎంతో యాక్టివ్ గా ఉంటారు. తాజాగా ఆయన ట్విట్టర్ లో చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.
ఆనంద్ మహీంద్రా.. భారతదేశ బడా వ్యాపారవేత్తగానే కాకుండా ఒక వ్యక్తిగానూ ఆయనకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. రూ.1.5 లక్షల కోట్ల విలువైన అతి పెద్ద ఆటో మోటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ కు ఛైర్ పర్సన్ అయినా ఎంతో సింపుల్ గా ఉంటారు. ముఖ్యంగా ట్విట్టర్ లో ఎంతో యాక్టివ్ గా ఉంటారు. ఆయనకు బాగా నచ్చిన, ప్రజలను ఆలోజింపచేసే వీడియోలు, మారుమూల ప్రాంతాల్లో గుర్తింపు లేని వ్యక్తుల టాలెంట్ ని వైరల్ చేయడం చేస్తుంటారు. అలాగే తమ కంపెనీ అప్ డేట్స్ కూడా ట్విట్స్ రూపంలో తెలియజేస్తుంటారు. తాజాగా ఆనంద్ మహీంద్రా చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు భారతదేశ ఆటో మొబైల్ రంగాన్ని ఊపేస్తోంది. బిట్ కాయిన్ తో మహీంద్రా కార్లు కొనచ్చు అంటూ హింట్ ఇచ్చారు.
క్రిప్టో కరెన్సీలో బిట్ కాయిన్ అనేది ఎంతో పవర్ ఫుల్. ప్రపంచంలో చాలా దేశాల్లో వీటిలో లావాదేవీలు చేస్తున్నారు కూడా. కానీ, భారతదేశంలో మాత్రం క్రిప్టో కరెన్సీ అనేది లీగల్ కాదు. త్వరలోనే కేంద్రం కూడా క్రిప్టో కరెన్సీ లావాదేవీలను చట్టబద్దం చేయాలని చూస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దానిపై కూడా పన్ను విధించేలా ప్రణాళికలు రచిస్తున్నట్లు గతంలో ప్రకటించారు. అయితే ఇంకా అవి కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు ఆనంద్ మహీంద్రా చేసిన ట్వీట్ తో మరోసారి భారత్ లో క్రిప్టో కరెన్సీపై చర్చ మొదలైంది. ట్విట్టర్ వేదికగా ఒక యూజర్ బిట్ కాయిన్ తో మహీంద్రా కార్లు కొనచ్చా? అని ప్రశ్నించాడు. అందుకు స్వయంగా ఆనంద్ మహీంద్రానే సమాధానం చెప్పారు.
ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ వేదికగా యూజర్ల ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ ఉంటారు. అలాగే బిట్ కాయిన్ తో మహీంద్రా కార్లు కొనచ్చా అంటూ ప్రశ్నించగా.. “ఇప్పుడే కాదు.. కానీ, మెల్ల మెల్లగా భవిష్యత్ లో కొనచ్చు” అంటూ సమాధానం చెప్పారు. ఒకవేళ మహీంద్రా కంపెనీ బిట్ కాయిన్ లావాదేవీలు అనుమతిస్తే భారత్ లో తొలి కంపెనీగా నిలుస్తుంది. అయితే అది అంత త్వరగా జరిగే పనైతే కాదు. మహీంద్రా లాంటి వ్యక్తి ఇలా స్పందించడంతో భారత్ లో క్రిప్టో కరెన్సీ లావాదేవీలను చట్టబద్దం చేస్తారంటూ మరోసారి గుసగుసలు వినిపిస్తున్నాయి. మహీంద్రా కార్లను బిట్ కాయిన్ తో కొనుగోలు చేసే అకాశం వస్తే.. 1.16 బిట్ కాయిన్ తోనే మహీంద్రా XUV700 కారుని కొనుగోలు చేయచ్చు అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. భారత్ లో బిట్ కాయిన్ తో కార్లు కొనే అవకాశం ఇవ్వడం మంచిదేనా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Not yet. But maybe bit by bit in the future.. https://t.co/pQS0ZQ52Qf
— anand mahindra (@anandmahindra) April 20, 2023