ఇటీవల కాలంలో క్యాబ్ డ్రైవర్లు వివాదాల పాలు అవుతున్నారు. బుక్ చేసిన సమయానికి రాకపోవడంతో పాటు దురుసు ప్రవర్తనతో వార్తల్లో నిలుస్తున్నారు. అలాగే అనుకున్న దాని కన్నా చార్జీలు ఎక్కువ వసూలు చేయడం, రాష్ డ్రైవింగ్ వంటి కంప్లయింట్స్ వస్తూనే ఉన్నాయి.
ఎక్కడికైనా త్వరగా ప్రయాణించాలన్నా, దూర భారాలు వెళ్లాలన్నా క్యాబ్ బుక్ చేసుకుంటాం. అయితే డ్రైవర్ నడిపే దాన్ని బట్టి ప్రయాణం సౌకర్యవంతమా, నరకమా అని తేలిపోతుంది. ఇటీవల కాలంలో క్యాబ్ డ్రైవర్లు వివాదాల పాలు అవుతున్నారు. బుక్ చేసిన సమయానికి రాకపోవడంతో పాటు దురుసు ప్రవర్తనతో వార్తల్లో నిలుస్తున్నారు. అలాగే అనుకున్న దాని కన్నా చార్జీలు ఎక్కువ వసూలు చేయడం లేదా ఏసీ పెంచమంటే గుర్రుగా చూడటం, రాష్ డ్రైవింగ్ వంటి కంప్లయింట్స్ వస్తూనే ఉన్నాయి. దీంతో క్యాబ్ బుక్ చేసుకునేందుకు ప్రయాణీకులు భయపడుతున్నారు. అయితే ఈ క్యాబ్ డ్రైవర్ కాస్త విభిన్నం. అతడి క్యాబ్ బుక్ అయితే చాలు.. సంభ్రమాశ్చర్యంలో మునిగి తేలుతారు.
క్యాబ్ డ్రైవర్లలో మంచి వ్యక్తులే కాదూ.. ప్రయాణీకుల కోసం ఆలోచించే వ్యక్తులు కూడా ఉంటారా అని ఆశ్చర్యపోయేలా చేశాడు అబ్దుల్ ఖాదీర్ అనే వ్యక్తి. ఈ డ్రైవర్ ప్రయాణీకుల కోసం ఏం చేశాడో తెలిస్తే.. మెచ్చుకోకుండా ఉండరు. ఉత్తర ప్రదేశ్కు చెందిన అబ్దుల్ ఖాదీర్ క్యాబ్ నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. అతడి క్యాబ్ ఎక్కితే చాలు.. హాయిగా ప్రయాణం చేయవచ్చు. అందులో అన్ని రకాల సౌకర్యాలు లభిస్తాయి. అందుకే అతడి కారులో ప్రయాణించేందుకు ఆసక్తి చూపుతుంటారు ప్రయాణీకులు. ఇందులో స్నాక్స్, కూల్ డ్రింక్స్, న్యూస్ పేపర్, వైఫై వంటి సదుపాయాలు ఉంటాయి. అయితే వీటి కోసం ఒక్క రూపాయి కూడా చార్జ్ చేయడం లేదు ఖాదీర్. ఈ విషయాన్ని ఓ ప్రయాణీకుడు తన ట్విట్టర్లో పేర్కొన్నాడు. ప్రస్తుతం ఇతగాడి గురించి న్యూస్ వైరల్ అవుతుంది.
శ్యామ్ లాల్ యాదవ్ అనే ట్విట్టర్ యూజర్ ఖాదీర్ గురించి పేర్కొన్నారు. ‘ఈ రోజు నేను ఊబర్ ఎక్కాను. ఆ డ్రైవర్ పేరు అబ్దుల్ ఖాదీర్. అతడి వయస్సు 48 ఏళ్లు. అందులో ఫస్ట్ ఎయిడ్ వంటి అనేక సదుపాయాలను ఉచితంగా అందిస్తున్నారు. పేద పిల్లల కోసం డొనేషన్ బాక్స్ కూడా ఏర్పాటు చేశాడు. అతను గత 7 సంవత్సరాల్లో ఒక్క రైడ్ కూడా క్యాన్సిల్ కాలేదు. అతడి పట్ల చాలా ఇంప్రెస్ అయ్యాను ’అంటూ అతడి ఫోటోను జత చేశారు. ఆ ఫోటోలో ‘ప్రతి ఒక్కరినీ గౌరవిస్తామని, వేసుకునే దుస్తులను బట్టి వారిని అంచనా వేయలేం’అంటూ నీతి వ్యాఖ్యాలను పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతుంది. దీంతో ఆ క్యాబ్ డ్రైవర్లను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు నెటిజన్లు.