సాధారణంగా పండుగలు వచ్చాయంటే.. దేవాలయాల్లో సందడి నెలకొంటుంది. దైవ సన్నిధిలో పూజా, భజన కార్యక్రమాలతో భక్తులు పారవశ్యంలో మునిగిపోతుంటారు. దసరా పండుగ వేళ సోషల్ మీడియాలో ఓ ఆసక్తికరమైన వీడియో వైరల్‌గా మారింది. కొంత మంది సాధువులు భక్తితో భజన చేస్తు పాటలు పాడుతున్నారు.. ఇందులో విశేషం ఏంటీ అనుకుంటారా? వారితో పాటు ఓ కోతి కూడా భజన చేస్తూ తాలం వేస్తూ భక్తి పారవశ్యంలో మునిగిపోయింది.
ఒక సాధువు ఒడిలో కూర్చున్న వానరం లయబద్ధంగా కర్తల్ ప్లే చేసి అక్కడున్న వారినందరినీ ఆశ్యర్యంలో ముంచెత్తేసింది. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు గానీ ఒక కోతి భజన చేస్తున్న సాధువుల చెంతకు చేరింది. ఆ పాటకు అనుకూలంగా ఎప్పటి నుంచో అనుభవం ఉన్నదానిలా కోతి తాలం వేయడం నెటిజన్లను ఫిదా చేసింది.
విజయదశమి.. రాములోరి భక్తిలో హనుమంతుడు చేస్తున్న భక్తి భజన అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇంత పారవశ్యామా ఇలాంటి కోతిని తాను ఎన్నడూ చూడలేదు అంటూ ఒక యూజర్ కామెంట్ చేశారు. పంకజ్ పరాశర్ తన ఫేస్‌బుక్ ఖాతాలో ఈ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియో చూసి నెటిజన్లు ఫిదా కావడంతో లక్షలాది మందికి వీక్షించగా, 30 వేల మంది షేర్ చేశారు.