శ్రీకృష్ణుడు ఒంటి మీద ఉన్న ఆభరణాలను అపహరించి అక్కడ నుంచి పారిపోయాడు. ఆ తర్వాత అతడు కొన్ని రోజులు బాగానే ఉన్నాడు. తనను తాను ప్రశ్నించుకున్నాడు.
దొంగలు దేన్నయినా దోచుకెళ్లారు అంటే.. దాన్ని మళ్లీ వెనక్కు తెచ్చి ఇవ్వటం జరగదు. పోలీసులు పట్టుకుంటే తప్ప దొంగిలించిన వాటిని తిరిగి ఇవ్వరు. కానీ, కొన్ని అత్యంత అరుదైన సందర్భాల్లో మాత్రం.. దొంగలు అందరూ ఆశ్చర్యపడే పనుల్ని చేస్తుంటారు. దొంగిలించిన వాటిని తిరిగి పెట్టేస్తుంటారు. తాజాగా, ఓ గుడిలో దొంగతనం చేసిన ఓ దొంగ.. దొంగిలించిన వాటిని తిరిగి అక్కడే పెట్టేశాడు. ఈ సంఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఒడిశాలోని గోపినాథ్ పూర్‌లో గోపినాథ్ ఆలయం ఉంది. అక్కడ ప్రతి రోజు నిత్యం పెద్ద సంఖ్యలో భక్తులు భక్తి, శ్రద్దలతో ప్రత్యేక పూజలు చేస్తుంటారు.
ఆలయానికి ఎప్పటి లాగానే భక్తులు వచ్చి వెళ్తుండేవారు.అలా ఈ దొంగ కూడా రోజులాగానే వచ్చి కృష్ణుడు మీద ఉన్న ఆభరణాలను దొంగిలించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు. అయితే ఆలయానికి వచ్చాడు. ఆ రోజు మాత్రం భక్తులు, అర్చకులు ఎవరూ కనబడడం లేదు. ఇదే సరైన సమయం అనుకున్నాడు. శ్రీకృష్ణుడు ఒంటి మీద ఉన్న ఆభరణాలను అపహరించి అక్కడ నుంచి పారిపోయాడు. ఆ తర్వాత అతడు కొన్ని రోజులు బాగానే ఉన్నాడు. అలా ఉండగా అంతలోనే ఏమైందో తెలియదు కానీ.. దొంగతనం చేసిన పాపానికి ఆ దొంగకి ఏ పని మెుదలు పెట్టినా ఆ పని మధ్యలో ఆగిపోవడం, తను పడుకున్నప్పుడు చెడు కలలు రావడం, అలా ఏదో ఒకరకంగా సమస్యలు వస్తూనే ఉన్నాయి.
అతడు ఎందుకు తనకు ఇలా అయితుందని బాగా ఆలోచించాడు. తనను తాను ప్రశ్నించుకున్నాడు. ఒకసారి ఆ దొంగ భగవద్గీత ను చదవాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా భగవద్గీతను చదవటం ప్రారంభించాడు. ఆ భగవద్గీత చదివిన తర్వాత దొంగలో మార్పు వచ్చింది. దాదాపు 9 ఏళ్ల తర్వాత అతడు దొంగిలించిన ఆభరణాలు మళ్లీ తిరిగి గుడిముందు వదిలేసి వెళ్లాడు. ఎత్తుకెళ్లిన ఆభరణాలతో పాటు, రూ. 300 కూడా అందులో పెట్టాడు. తాను చేసిన తప్పుకు ప్రాయశ్చితంగా డబ్బు పెడుతున్నట్లు ఓ చీటీ కూడా పెట్టాడు. ఆ చీటీలో తనకు ఎదురైన అనుభవాలు చెప్పుకొచ్చాడు. ఇక, దొంగలించబడ్డ ఆభరణాలు మళ్లీ వెనక్కురాటంతో భక్తులు సంతోషం వ్యక్తం చేశారు. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.