సోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన తర్వాత సమాజంలో ఎక్కడెక్కడో జరిగిన విషయాలు అందరికీ ఇట్టే తెలిసిపోతున్నాయి. అందులో కొన్ని ఫన్నీ వీడియోలు కూడా ఉంటున్నాయి. ఆ ఫన్నీ వీడియోలు చూసినపుడు మనసుకు కొంత ప్రశాంత లభిస్తుంది.
కోతులు.. మనుషుల ఫ్రెండ్లీ నైబర్స్.. ఇవి అప్పుడప్పుడు తప్పితె.. పెద్దగా మనుషుల మీద దాడులు చేయవు. ఇవి ఎక్కువగా ఆహారం కోసం మనుషులపై తిరగబడుతుంటాయి. దాడులు కూడా చేస్తుంటాయి. ఇవి ఎంతో ఫోకస్‌గా.. పక్కా ప్లాన్‌తో తమ టార్గెట్‌ను అందుకుంటాయి. ఎంత మంది ఉన్నా టార్గెట్ మీదే దృష్టి పెట్టి విజయం సాధిస్తుంటాయి. తాజాగా, ఓ కోతి పెళ్లి జరుగుతున్న మండపంలోకి చొరబడింది. మరి, దానికి తినడానికి ఏమీ దొరకలేదేమో.. ఏకంగా పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు తలపై ఉన్న జీలకర, బెల్లాన్ని ఎత్తుకు పోయింది. ఈ సంఘటన తెలంగాణలో చోటుచేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఓ జంట పెళ్లి తాజాగా జరిగింది. పెళ్లి సందర్భంగా బంధు, మిత్రుల మధ్య కల్యాణ మండపంలో వధూవరులు ఒకరి తలపై ఒకరు జీలకర్ర, బెల్లం పెట్టుకున్నారు. తర్వాత ఇద్దరికీ పెళ్లి అయింది. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు ఒకరి తలపై ఒకరు తలంబ్రాలు పోసుకుంటూ ఉన్నారు. ఎంతో సంతోషంగా తలంబ్రాలు పోసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కడినుంచి వచ్చిందో తెలియదు కానీ, ఓ కోతి పెళ్లి మండపంలోకి వచ్చింది. తలంబ్రాలు చల్లుతున్న వరుడి మీదకు ఎక్కింది.
అతడి తలపై ఉన్న జీలకర్ర, బెల్లాన్ని తీసుకుంది. కోతి ఒక్కసారిగా మీదకు రావటంతో వధూవరులు భయపడిపోయారు. వధువు కేకలు పెట్టింది. దీంతో కోతి వరుడి మీద నుంచి వధువు మీదకు దూకింది. ఆమె తలపై ఉన్న జీలకర్ర, బెల్లాన్ని కూడా లాక్కుని అక్కడినుంచి వెళ్లిపోయింది. కోతి చేష్టలకు మండపంలో ఒక్కసారిగా అలజడి మొదలైంది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘కోతి బుద్ధి కోతి బుద్దే’’.. ‘‘ కోతి ఆకలి వేసినట్లు ఉంది పాపం అందుకే బెల్లం కోసం వెళ్లింది’’..‘‘జంటకు హనుమంతుడి ఆశీర్వాదం లభించింది’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి, ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.