దేశ రాజధాని ఢిల్లీ నగరానికి దాదాపు 50 కి.మీ దూరంలోని నోయిడాలో సూపర్ టెక్ అనే సంస్థ నిర్మించిన 40 అంతస్తుల జంట భవనాల కూల్చివేతకు రంగం సిద్దమైంది. ఈ భవనల కూల్చివేతకు ముందస్తు ప్రక్రియ మొదలైంది. ఆగష్టు 28 ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు కూల్చివేత పనులు చేపట్టనున్నారు. దీంతో ఈ పనులకు సంబంధించి భద్రతా నిబంధనలను కచ్చితంగా పాటించాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయంపై శుక్రవారం అధికారులతో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం ఈ ట్విన్ టవర్స్ కూల్చివేత హాట్ టాపిక్ గా మారింది. అయితే ఆకాశాన్ని తాకుతున్నట్లు అనిపించే ఈ భవనాల కూల్చివేత వెనక ఉన్న కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఢిల్లీకి సమీపంలో ఉత్తరప్రదేశ్ పరిధిలో నోయిడాలోని సెక్టార్-93లో సూపర్ టెక్ కంపెనీ ఈ 40 అంతస్తుల రెండు టవర్స్‌ను 2009లో నిర్మించింది. ఈ భవనాల నిర్మాణం కుతుబ్ మినార్ కంటే మిన్నాగా 100 మీటర్ల ఎత్తు ఉన్నాయి. ఈ ట్విన్ టవర్స్ లో మొదటి దాని పేరు ‘సియాన్’. రెండవ టవర్ పేరు “అపెక్స్”. అయితే ఈ భారీ ప్రాజెక్టు నిర్మాణంలో నిబంధనలు పాటించలేదంటూ స్థానికులు కోర్టును ఆశ్రయించారు. ఇరువర్గాల వాదనలు విన్న సుప్రీం కోర్టు .. ఈ భవనాలను కూల్చివేయాలంటూ తీర్పు ఇచ్చింది. అయితే ఇందులో ప్లాట్లు కొన్నవారికి సూపర్ టెక్ సంస్థ పూర్తి మొత్తం డబ్బులు తిరిగి చెల్లిస్తుందని శుక్రవారం సుప్రీం కోర్టు భరోసా ఇచ్చింది.
కొనుగోలు దారుల తక్షణ అవసరాలకు రూ. కోటి తమ రిజిస్ట్రీలో జమ చేయాలని న్యాయమూర్తులు సదరు సంస్థను ఆదేశించారు. దీంతో తాజాగా యూపీ సర్కార్ కూల్చివేతకు రంగం సిద్ధం చేసింది. చుట్టు పక్కల భవనాల్లోని 5 వేల మందిని ఆదివారం ఉదయం 7 గంటల కల్ల ఖాళీ చేయిస్తారు. వీరిని తరలించేందుకు 2700 వాహనాలను ఉపయోగించనున్నారు. ఈ రెండు భవనాల చుట్టూ అర కిలోమీటర వరకు జనసంచారం లేకుండా చూస్తారు. ఈ జంట భవనాల చుట్టూ ఒక నాటికల్ మైలు గగనతలం ఆదివారం విమానాలకు అందుబాటులో ఉందని అధికారులు తెలిపారు. కూల్చివేత కార్యక్రమాన్ని పర్యవేక్షించడానికి బ్రిటన్ నుంచి నిపుణుల్ని రప్పిస్తున్నారు.
చుట్టుపక్కల భవనాల కోసం ముందు జాగ్రత్త చర్యగా ఎడిఫస్ కంపెనీ రూ.100 కోట్ల బీమా కవరేజీ తీసుకుంది. ఈ భవనాలను పేల్చేందుకు 3700 కిలోలకుపైగా పేలుడు పదార్ధలను వాడుతున్నారు. ఈ టవర్స్ ను పేల్చేందుకు 9600 రంధ్రలు చేశారు. ఈ కూల్చివేత ద్వారా పోగైన చెత్తను తొలగించడానికి 3 నెలల సమయం పడుతుంది. మరి.. ఈ ట్విన్ టవర్స్ కూల్చివేతపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.