భారత ఫార్మా కంపెనీ ‘మైడెన్ ఫార్మా‘ తయారు చేసిన దగ్గు సిరప్ ల కారణంగా ఆఫ్రికా దేశమైన గాంబియాలో 66 మంది చిన్నారులు మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ఆందోళన వ్యక్తం చేస్తూ వైద్య ఉత్పత్తుల హెచ్చరికను జారీ చేసింది. ఈ కంపెనీ తయారు చేసిన సిరప్ లలో మోతాదుకు మించి డైథిలిన్ గ్లైకాల్, ఇథిలీన్ గ్లైకాల్ ఉపయోగించడం వల్లే ఈ మరణాలు సంభవించాయని వెల్లడించింది. ఈ ప్రకటన వెలుబడిన వెంటనే సదరు ఫార్మా కంపెనీ తన కార్యాకలాపాలను ఆపేసింది.
మైడెన్ ఫార్మా తయారుచేసిన సిరప్ లను వినియోగించి గాంబియాలో 66 మంది చిన్నారులు మృత్యువాత పడినట్లు డబ్ల్యూహెచ్ఓ చీఫ్ ట్రెడోస్ అథ్నామ్ పేర్కొన్న సంగతి తెలిసిందే. చిన్నారుల మృతి ఆ కుటుంబాలకు తీరని శోకం మిగిల్చిందన్న ఆయన.. ఈ కలుషితమైన మందులను వాడొద్దని హెచ్చరించారు. కాగా, ఆ నాలుగు మందులు (ప్రోమెథాజైన్ ఓరల్ సొల్యూషన్, కోఫెక్స్మలిన్ బేబీ కాఫ్ సిరప్, మాకోఫ్ బేబీ కాఫ్ సిరప్, మాగ్రిప్ ఎన్ కోల్డ్ సిరప్) సోనిపట్(హరియాణా)లో తయారవుతున్నాయని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. ఈ ప్రకటన వెలుబడిన వెంటనే సదరు మైడెన్ ఫార్మా కంపెనీ తన కార్యాకలాపాలను ఆపేసింది. ఈ మేరకు పీతంపురా(ఢిల్లీ)లోని అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయం, సోనిపట్(హర్యానా) లోని తయారీ కంపెనీలను ప్రస్తుతానికి మూసివేసింది. కాగా, డబ్ల్యూహెచ్ఓ ప్రకటనపైలో భారత ప్రభుత్వం స్పందించింది. చిన్నారుల మరణాలపై డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI)ను డబ్ల్యూహెచ్ఓ అలెర్ట్ చేసిన నేపథ్యంలో కేంద్ర డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ వెంటనే రంగంలోకి దిగింది. అయితే.. డబ్ల్యూహెచ్ఓ ఆరోపణలపై ఆ కంపెనీ ఇంత వరకు స్పందించకపోవడం గమనార్హం.
#VLOG | Maiden Pharma’s Office Shut After WHO Links 66 Deaths To Cough Syrups
NDTV’s Priyanshi Sharma reports pic.twitter.com/dSsCD4qxZs
— NDTV (@ndtv) October 6, 2022