Viral Video: విద్యార్ధులకు విద్యా బుద్ధులు నేర్పి గాడిన పెట్టాల్సిన గురువులే గాడి తప్పుతున్నారు. కొన్ని కొన్ని సార్లు విచక్షణ కోల్పోయి చదువుకున్న మూర్ఖుల్లా ప్రవర్తిస్తున్నారు. పిల్లల ముందే అసహ్య చేష్టలకు పాల్పడుతున్నారు. తాజాగా, ఓ ఇద్దరు మహిళా టీచర్లు స్కూల్లో పిల్లల ముందే గొడవపడ్డారు. బూతులు తిట్టుకోవటమేకాదు.. కొట్టుకున్నారు కూడా. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. ఉత్తర ప్రదేశ్‌లోని హమిర్‌పూర్‌లో బాలికల ప్రీ సెకండరీ స్కూల్ ఉంది. గాంధీ జయంతి రోజున ఆ స్కూల్లో ఓ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో టీచర్లందరూ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఓ ఇద్దరు మహిళా టీచర్ల మధ్య శుభ్రత విషయంలో గొడవ మొదలైంది. ఆ గొడవ కాస్తా చిలికి చిలికి గాలి వానగా మారింది. ఆగ్రహానికి గురైన ఆ టీచర్లు ఒకరిని ఒకరు బూతులు తిట్టుకున్నారు.
అంతటితో ఆగకుండా ముష్టి యుద్ధానికి దిగారు. సెల్‌ఫోన్లు విసిరేసుకున్నారు. ఈ గొడవనంత చూస్తున్న బాలికలు భయంతో బిక్కుబిక్కుమన్నారు. తోటి ఉపాధ్యాయులు వారి గొడవను ఆపటానికి ప్రయత్నించి విఫలమయ్యారు. ఆఖరికి స్కూల్లోని బాలికలు కూడా ఎంత ఆపడానికి ప్రయత్నించినా వారు వినలేదు. పోటాపోటీగా గొడవ పడ్డారు. దాదాపు 45 నిమిషాల పాటు ఈ గొడవ జరిగింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూస్తున్న నెటిజన్లు ఆ ఇద్దరు టీచర్లపై ఆసహనం వ్యక్తం చేస్తున్నారు. పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన వారే ఇలా చేస్తే.. పిల్లలు ఏం నేర్చుకుంటారు అంటూ పెదవి విరుస్తున్నారు.
A fight broke out between the two female teacher of Govt School in Hamirpur Uttar Pradesh. pic.twitter.com/iC69WoZzhv
— Ahmed Khabeer احمد خبیر (@AhmedKhabeer_) October 3, 2022