బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టి తన భర్త రాజ్ కుంద్రా పోర్నోగ్రాఫిక్ కంటెంట్ క్రియేషన్ వ్యవహారంలో అరెస్ట్ అయిన విషయం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నది. ఈ కేసులో అనేక విషయాలను మహారాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ పోలీసులు, బాంబే హై కోర్టు ప్రాసిక్యూషన్ పలు విషయాలను వెలికి తీస్తున్నాయి. ఇక కొద్ది రోజుల నుండి మీడియా ప్రతినిధులు, సోషల్ మీడియాలోని ప్రజలు శిల్పాశెట్టి పై తీవ్రమైన విమర్శలు గుప్పిస్తున్నారు. బాలీవుడ్ ప్రధాన తారాగణం లో ఒకరైన శిల్పాశెట్టి భర్త ఇలా చేయడం ఏమిటని అందరూ ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో శిల్పాశెట్టి భావోద్వేగంగా స్పందిస్తూ ట్విట్టర్ వేదికగా సమాధానాన్ని వెల్లడించారు.
‘చాలా పుకార్లు, ఆరోపణలు వస్తున్నాయి. మీడియాతో పాటు శ్రేయోభిలాషులుగా పిలవబడే కొందరు నాపై అవాంఛనీయ ఆరోపణలు చేస్తున్నారు. నాకు మాత్రమే కాకుండా నా కుటుంబానికి కూడా చాలా ట్రోలింగ్ ఎదురయ్యాయి. ఇప్పుడు నేను వ్యాఖ్యానించలేను. ఇది అన్యాయం కాబట్టి దయచేసి నా భర్తపై తప్పుడు ఆరోపణలు చేయడం ఆపి వేయండి’.
‘నేను చెప్పేది ఏమిటంటే దర్యాప్తు కొనసాగుతోంది. నాకు ముంబై పోలీసు, భారతీయ న్యాయవ్యవస్థపై పూర్తి నమ్మకం ఉంది. ఒక కుటుంబంగా మేము అందుబాటులో ఉన్న అన్ని చట్టపరమైన పరిష్కారాలను ఆశ్రయిస్తున్నాము. కానీ అప్పటి వరకు నేను వినయంగా అడుగుతున్నాను’.
ముఖ్యంగా తల్లిగా నా పిల్లల కోసం మా గోప్యతను గౌరవించమని, నిజం ఏంటో తెలుసుకోకుండా తెలిసీ తెలియని సమాచారంతో వ్యాఖ్యానించడం మానుకోవాలని అభ్యర్థిస్తున్నా’నంటూ తన బాధని ట్విట్టర్ వేదికగా తెలియజేసింది.
‘ఇప్పటివరకు తనను నమ్మిన వారిని ఎవరిని తాను మోసం చేయలేదు. అలాగే తక్కువ చేయలేదని చెప్పారు. ఈ కష్టకాలంలో తన కుటుంబ గౌరవాన్ని, గోప్యతను ప్రతి ఒక్కరూ గౌరవించాలని చెప్పిన ఆమె ఈ కేసు విషయంలో మాత్రం చట్టం తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తుంది కాబట్టి అందరూ ప్రశాంతంగా ఉండాలని శిల్పాశెట్టి తెలియజేశారు.
My statement. pic.twitter.com/AAHb2STNNh
— SHILPA SHETTY KUNDRA (@TheShilpaShetty) August 2, 2021