ఢిల్లీ ఆరోగ్య శాఖ మాజీ మంత్రి సత్యేంద్ర జైన్. .అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజరే ఉద్యమంలో పాల్గొన్నారు. ఇప్పుడు అదే అవినీతి ఆరోపణలపై జైలు పాలయ్యారు. మూడు పర్యాయాలు అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో మంత్రి పదవులను అధిరోహించారు. త ఏడాది మనీలాండరింగ్ కేసులో అరెస్టై తీహార్ జైలులో ఉన్న మాజీ మంత్రి.. బాత్రూములో కాలు జారి పడ్డారు.
ఇటీవల కాలంలో ఎక్కువగా వార్తల్లో నిలిచిన రాజకీయ నేతల్లో ఒకరు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత, ఢిల్లీ ఆరోగ్య శాఖ మాజీ మంత్రి సత్యేంద్ర జైన్. అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజరే ఉద్యమంలో పాల్గొన్న ఆయన.. అదే అవినీతి ఆరోపణలపై జైలు పాలయ్యాడు. మూడు పర్యాయాలు అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో మంత్రి పదవులను అధిరోహించారు. సత్యేంద్ర జైన్ రాజకీయాల్లో చేరడానికి ముందు.. సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేశాడు, తరువాత ఆర్కిటెక్చరల్ కన్సల్టెన్సీ సంస్థను స్థాపించడానికి ప్రభుత్వ ఉద్యోగాన్ని విడిచిపెట్టాడు. ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు అత్యంత సన్నిహితుడన్నపేరుంది. గత ఏడాది మనీలాండరింగ్ కేసులో అరెస్టై తీహార్ జైలులో ఉన్న మాజీ మంత్రి.. బాత్ రూమ్‌లో కాలు జారి పడ్డారు. తన గదిలోని బాత్ రూమ్‌లో సృహ తప్పి పడిపోయి ఉండటాన్ని అధికారులు గుర్తించారు.
తీవ్రంగా గాయపడ్డ సత్యేంద్రను తొలుత జైలు అధికారులు దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆయన పరిస్థితి విషమంగా ఉందని లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం సత్యేందర్ జైన్‌కు ఐసీయూలో చికిత్స కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఆక్సిజన్ సపోర్ట్‌పై ఉన్నట్లు జైలు అధికారిక వర్గాలు వెల్లడించాయి. సత్యేందర్ జైన్ ఆరోగ్య పరిస్థితి వివరాలను ఆమ్ ఆద్మీ పార్టీ ట్విట్టర్‌లో వెల్లడించింది. గతంలో ఆయన ఇలాగే ఓసారి బాత్‌రూమ్‌లో పడిపోవడం వల్ల వెన్నెముకకు తీవ్ర గాయమైందని తెలిపింది. గత సోమవారం కూడా జైన్ అస్వస్థతకు గురైనందున జైలు అధికారులు ఆయన్ను ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆ సమయంలో ఆయన బక్కచిక్కినట్లు స్పష్టంగా కనిపిస్తోంది.