స్వతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ను ఓ యువకుడు ఘోరంగా అవమానించాడు. సిగరెట్ తాగుతూ ఏకంగా నేతాజీ విగ్రహం నోట్లో పెట్టాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారింది.
అహింస మార్గం ద్వారా స్వరాజ్యం సిద్ధిస్తుందని కొందరు అనుకుంటే.. లేదు, సాయుధ పోరాటం ద్వారానే స్వరాజ్యం వస్తుందని గళమెత్తి చాటారు స్వతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఆనాటి స్వతంత్ర్య భారత ఉద్యమంలో అలుపెరుగని పోరాటం చేసి చివరికి అమరుడయ్యాడు. అయితే ఇప్పటికీ ఆయన మరణం రహస్యంగానే మిగిలిపోవడం విశేషం. అలాంటి మహనీయుడికి తాాజాగా ఘోరమైన అవమానం జరిగింది.
తప్ప తాగిన ఓ యువకుడు.. సిగరెట్ తాగుతూ అదే సిగరెట్ ను సుభాష్ చంద్రబోస్ విగ్రహం నోట్లో పెట్టాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారుతోంది. ఛత్తీస్ గఢ్ రాష్ట్రం బిలాస్ పూర్ లోని ఓ ప్రాంతం. ఇక్కడే నివాసం ఉంటున్న ఓ యువకుడు ఫుల్ గా తాగి హల్ చల్ చేశాడు. చౌక్ సర్కాండ లో ఉన్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహం నోట్లో సిగరెట్ పెడుతూ ఘోరంగా అవమానించాడు. అంతేకాకుండా సిగరెట్ తాగుతూ అతని నోట్లో నుంచి వచ్చే పొగను నేతాజీ విగ్రహం ముఖం మీదకు ఊదాడు.
ఇదంతా గమనించిన కొందరు యువకులు తమ సెల్ ఫోన్ లో వీడియోలు తీసుకున్నారు. ఇక అదే వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది. చివరికి అదే వీడియో పోలీసుల వరకు వెళ్లడంతో.. వెంటనే పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ఇక ఈ వీడియోను చూసిన చాలా మంది నెటిజన్స్ ఆగ్రహంతో ఊగిపోతున్నారు. స్వతంత్ర్యం కోసం ఎన్నో పోరాటాలు చేసిన నేతాజీని ఘోరంగా అవమానించిన ఈ దుర్మార్గుడిని కఠినంగా శిక్షించాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. నేతాజీ విగ్రహం నోట్లో సిగరెట్ పెట్టిన ఈ యువకుడి దారుణంపై మీరెలా స్పందిస్తారు? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
मेरे सूत्र ने वीडियो भेजा और बताया,छग में बिलासपुर के सुभाष चौक सरकंडा में नेताजी सुभाषचंद्र बोस की मूर्ति के मुँह में नशे में धुत्त हो कर सिगरेट फूंकने वाला ये युवक मुंगेली में आरएसएस कार्यकर्ता है और इसका बाप बिलासपुर में भाजपा के अधिवक्ता परिषद का संरक्षक है। pic.twitter.com/WwQ6ouhTwp
— Kunal Shukla (@kunal492001) March 10, 2023