అదృష్ట లక్ష్మి ఎప్పుడు ఎవరిని ఎలా కనికరిస్తుందో చెప్పలేం. కాయాకష్టం చేసుకుని బతికే నిరుపేదలు రాత్రికి రాత్రి కోటీశ్వరుడయ్యాడు. కష్టపడితే కొంత వరకు డబ్బు సంపాదించవొచ్చు.. ఒకేసారి లక్షలు, కోట్లు రావాలని చూసేవారు లాటరీలను నమ్ముకుంటారు. చాలా మంది సంవత్సరాలు ఎదురు చూసినా జాక్ పాట్ తగలదు. కొంత మందికి మాత్రం అనుకోకుండా అదృష్టం కలిసి వస్తుంది. పశ్చిమబెంగాల్ లో ఒక వ్యక్తి అదృష్టం భలే కలిసి వచ్చింది. కేవలం ముప్పై రూపాయిలు పెట్టి కొన్న లాటరీకి ఏకంగా కోటి రూపాయాలు వచ్చాయి. దీంతో అతడు రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు.
పశ్చిమబెంగాల్ లో కి చెందిన మహబూబ్ అనే వ్యక్తి చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవితం వెల్లదీస్తున్నాడు. ఈ క్రమంలో తనకు వచ్చిన సంపాదనలో కొంత భాగం లాటరీలకు వెచ్చిస్తూ వస్తున్నాడు. జీవితంలో ఒక్క లాటరీ అయినా తగులుతుందనే నమ్మకంతో ఉన్నాడు. ఈ మద్య రూ.30 పెట్టి మహబూబ్ ఒక లాటరీ కొనుగోలు చేశాడు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అదృష్టం కలిసి వచ్చింది. మొదట తాను కోటి రూపాయలు గెల్చుకున్నావు అంటేనమ్మలేదు.
లాటీరీలో కోటి గెల్చుకున్నా అన్న విషయం తెలియగానే భయంతో పోలీస్ స్టేషన్ కి చేరుకొని తనకు రక్షణ కల్పించాలని కోరాడు. తనకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారని వారికోసం ఒక మంచి ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నా అన్నాడు. పిల్లలకు ఉన్నత చదువులు చదివించేందుకు ఈ డబ్బు వినియోగిస్తానని అన్నాడు మహబూబ్. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.